iDreamPost
android-app
ios-app

The Goat Movie: దళపతి విజయ్ రేర్ రికార్డ్.. ఇండస్ట్రీ చరిత్రలో ఇదే తొలిసారి?

  • Published Aug 10, 2024 | 3:04 PM Updated Updated Aug 10, 2024 | 3:04 PM

దళపతి విజయ్ ఓ రేర్ ఫీట్ సాధించడానికి రెడీ అయ్యాడు. బహుశా ఈ రికార్డు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇదే తొలిసారి కావొచ్చు. మరి ఆ అరుదైన ఘనత ఏంటో తెలుసుకుందాం పదండి.

దళపతి విజయ్ ఓ రేర్ ఫీట్ సాధించడానికి రెడీ అయ్యాడు. బహుశా ఈ రికార్డు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇదే తొలిసారి కావొచ్చు. మరి ఆ అరుదైన ఘనత ఏంటో తెలుసుకుందాం పదండి.

  • Published Aug 10, 2024 | 3:04 PMUpdated Aug 10, 2024 | 3:04 PM
The Goat Movie: దళపతి విజయ్ రేర్ రికార్డ్.. ఇండస్ట్రీ చరిత్రలో ఇదే తొలిసారి?

దళపతి విజయ్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పేరుకు కోలీవుడ్ హీరో అయినప్పటికీ.. టాలీవుడ్ లో తెలుగు స్టార్ హీరోకు ఉన్నంత రేంజ్ ఉంది. అందుకే అతడి సినిమాలు ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబడుతుంటాయి. ప్రస్తుతం క్రియేటీవ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'(ది గోట్) అనే చిత్రం చేస్తున్నాడు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ న్యూస్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే షేక్ చేస్తోంది. ఓ రేర్ ఫీట్ సాధించడానికి రెడీ అయ్యాడు విజయ్.

‘ది గోట్’ మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్. ఈ మూవీ తర్వాత మరొక్క చిత్రమే చేసి, సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. దాంతో ఈ మూవీపై ఇటు సినీ ప్రముఖుల్లో, అటు ప్రేక్షకుల్లో ఎంతో క్యూరియాసిటి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఓ రేర్ రికార్డును తన పేరిట లిఖించుకోబోతోంది. బహుశా సినిమా చరిత్రలో ఈ రికార్డ్ సాధించిన తొలి చిత్రం ‘ది గోట్’ కావొచ్చు అంటున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆ ఘనత ఏంటంటే?

The goat

విజయ్ గోట్ మూవీ విషయంలో నిర్మాతలు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. విడుదల రోజు ఈ చిత్రాన్ని తమిళనాడులో ఉన్న ప్రతీ ఒక్క థియేటర్ లో ప్రదర్శించనున్నాను. దాంతో ఇది సరికొత్త రికార్డుగా చరిత్రపుటల్లోకి ఎక్కబోతోంది. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఇలా రాష్ట్రంలోని థియేటర్లన్నింటిలో ప్రదర్శించలేదు అనుకుంటా అని చెప్పుకొస్తున్నారు. ఈ విషయం విజయ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిస్తోంది. ఇదిలా ఉండగా.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. మరి రేర్ ఫీట్ క్రియేట్ చేయబోతున్న విజయ్ ది గోట్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş