iDreamPost
android-app
ios-app

గుడ్ న్యూస్ చెప్పిన లేడీ కమెడియన్! తల్లి కాబోతున్నాను అంటూ.. పోస్ట్ వైరల్!

  • Published Aug 10, 2024 | 1:38 PM Updated Updated Aug 10, 2024 | 1:38 PM

ఓ లేడీ కమెడియన్ తాను తల్లికాబోతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. తన భర్తతో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసింది. దాంతో ఆమెకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఓ లేడీ కమెడియన్ తాను తల్లికాబోతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. తన భర్తతో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసింది. దాంతో ఆమెకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.

  • Published Aug 10, 2024 | 1:38 PMUpdated Aug 10, 2024 | 1:38 PM
గుడ్ న్యూస్ చెప్పిన లేడీ కమెడియన్! తల్లి కాబోతున్నాను అంటూ.. పోస్ట్ వైరల్!

సెబ్రిటీలు తమ ఇంట్లో జరిగే శుభకార్యాల గురించి, గుడ్ న్యూస్ ల గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియపరుస్తూ ఉంటారు. నటీ, నటులు ఎక్కువగా ప్రెగ్నెన్సీ, పెళ్లికి సంబంధించిన విషయాలనే సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఉంటారు. తాజాగా ఓ లేడీ కమెడియన్ తాను తల్లికాబోతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. తన భర్తతో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసింది.

ఇంద్రజ శంకర్.. ప్రముఖ తమిళ నటుడు రోబో శంకర్ కూతురుగా అందరికి పరిచయమే. లేడీ కమెడియన్ గా చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపే తెచ్చుకుంది. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి హీరోగా నటించిన ‘విజిల్’ సినిమాలో నటనకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఆ తర్వాత విశ్వక్ సేన్ ‘పాగల్’, కార్తీ ‘విరుమాన్’ సినిమాల్లో చేసింది.  కాగా.. తాజాగా ఈ నటి తల్లిని కాబోతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

తన భర్తతో కలిసి ఉన్న పిక్ ను పోస్ట్ చేస్తూ..”త్వరలోనే మేము తల్లిదండ్రులం కాబోతున్నాం. మీ ఆశీస్సులు మాపై ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సంతోషాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. థ్యాంక్యూ మామ ఇంత సంతోషాన్ని ఇచ్చినందుకు. నువ్వు ఎప్పుడూ నాతోనే ఉండాలని కోరుకుంటున్నాను లవ్ యు” అంటూ రాసుకొచ్చింది ఈ కమెడియన్. కాగా.. ఈ ఏడాది మార్చిలో కార్తీక్ అనే డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం పలు షోలు, సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ నటికి పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by INDRAJA SANKAR (@indraja_sankar17)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss