iDreamPost
android-app
ios-app

డార్లింగ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్‌ చెప్పిన రాజాసాబ్‌ నిర్మాత

  • Published Aug 23, 2024 | 11:41 AM Updated Updated Aug 23, 2024 | 11:41 AM

prabas, Rajasaab: డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ రాజాసాబ్. ఇక ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రాసాద్ నిర్మిస్తున్నా విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ మూవీ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

prabas, Rajasaab: డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ రాజాసాబ్. ఇక ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రాసాద్ నిర్మిస్తున్నా విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ మూవీ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

  • Published Aug 23, 2024 | 11:41 AMUpdated Aug 23, 2024 | 11:41 AM
డార్లింగ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్‌ చెప్పిన రాజాసాబ్‌ నిర్మాత

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రాసాద్ నిర్మిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన డార్లింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ కు, భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి ఏ అప్ డేట్ వస్తుందా.. ఇంకెప్పుడు ఈ సినిమాను థియేటర్స్ లో చూస్తామానని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజాసాబ్ నిర్మాత ఈ మూవీ పై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

రాజాసాబ్ నిర్మాత టీజీ ప్రాసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతేకాకుండా.. ఈ సినిమాపై తాము సైలెంట్ గా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంటామని నిర్మాత టీజీ విశ్వప్రాసాద్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాజాసాబ్ మూవీతో మేము చాలా సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ కొడతాం. అయితే రాజాసాబ్‌ను ప్రారంభించినప్పుడు ప్రభాస్‌ నటించాల్సిన పెద్ద చిత్రాలు లైన్‌లో ఉన్నాయి.  అయిన ఈ సినిమా చిత్రీకరణ సైలెంట్ గా జరుగుతోంది. ముఖ్యంగా ఇది చాలా పెద్ద సినిమా. సుమారు 38,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెట్‌ వేశాం. ఇప్పటి వరకు ఇండియాలో ఇంత భారీ సెట్ ఏ సినిమాకు వేయలేదు. పైగా ఈ సినిమాకు వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్‌లకు కూడా పెద్దపీట వేశాం. అలాగే సంగీతం కూడా మరో స్థాయిలో ఉంటుంది. ఇక ఫైట్స్ కూడా ప్రేక్షకులను బాాగా ఆకట్టుకుంటాయి. ఎందుకంటే.. ఈ సినిమా రొమాంటిక్, హారర్, యాక్షన్ ఇలా అన్ని ఎలివెంట్స్ రాజాసాబ్ ఉంటుందని’ విశ్వప్రసాద్ చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే రాజాసాబ్ మూవీలో రిద్ధి కుమార్, వరలక్ష్మి శరత్‌కుమార్, జిషు సేన్‌గుప్తా, బ్రహ్మానందం, యోగి బాబు కీలక పాత్రలు చేస్తున్నారు.  అలాగే ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 2025 ఏప్రిల్‌ 10న విడుదల కానుంది. మరీ, రాజాసాబ్ మూవీపై నిర్మాత చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş