iDreamPost
android-app
ios-app

ఒక చోట చేరిన స్టార్ హీరోలు.. ఎందుకంటే ?

  • Published Nov 08, 2024 | 6:00 PM Updated Updated Nov 08, 2024 | 6:00 PM

స్టార్ హీరోలు ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఒకరిద్దరు ఒకే చోట కనిపిస్తేనే తెగ ఖుషి అయిపోతుంటారు. కానీ ఇప్పడు ఒకేసారి చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబు , రామ్ చరణ్, నాగార్జున, అఖిల్ లాంటి వారు ఒకే చోట కలిశారు.

స్టార్ హీరోలు ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఒకరిద్దరు ఒకే చోట కనిపిస్తేనే తెగ ఖుషి అయిపోతుంటారు. కానీ ఇప్పడు ఒకేసారి చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబు , రామ్ చరణ్, నాగార్జున, అఖిల్ లాంటి వారు ఒకే చోట కలిశారు.

  • Published Nov 08, 2024 | 6:00 PMUpdated Nov 08, 2024 | 6:00 PM
ఒక చోట చేరిన స్టార్ హీరోలు.. ఎందుకంటే ?

చిరంజీవి విశ్వంభర మూవీ షూట్ లో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీకి ఫైనల్ టచ్ , ప్రమోషనల్ ప్లాన్స్ పనిలో ఉన్నాడు. అబ్బో ఇక మహేష్ బాబు గురించైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా జక్కన్నతో మూవీ షూటింగ్ ఏ స్టార్ట్ కాలేదు కానీ బాబు మాత్రం మేక్ ఓవర్ లో బిజీ అయ్యాడు. కింగ్ నాగార్జున కూడా రియాలిటీ షోస్ , మూవీస్ ను రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ టూ బిజీ ఉన్నాడు. ఇక అతని తనయుడు అఖిల్ కూడా కొత్త ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నట్లు టాక్. సో ఇలా స్టార్ హీరోలంతా నిమిషం తీరిక లేకుండా ఎవరి ప్రాజెక్ట్స్ తో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు. అయినా సరే వీరందరూ కలిసి ఒకే చోట చేరారు. ఇప్పుడు ఈ ఫోటోనే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సాధారణంగా ఒకరిద్దరు హీరోస్ కలిసి కనిపిస్తేనే.. మ్యూచువల్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అలాంటిది ఇంత మంది హీరోలు ఒకే చోట కనిపించడంతో.. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది.

ఇంత బిజీ బిజీగా ఉన్న వీరంతా కలవడం వెనుక రీజన్ ఏంటి? అసలు వారికి కలిసి పార్టీ చేసుకునేంత టైం కూడా ఉందా ? ఓ వైపు చూస్తే సినిమా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయ్ కదా? ఏదైనా అవార్డు ఫంక్షన్ ఉంటేనే ఒకరొస్తే ఒకరు రారు. అలాంటిది ఒకేసారి వీరంతా ఎందుకు మీట్ అయ్యారు ? ఇలాంటి ప్రశ్నలతో సోషల్ మీడియా కామెంట్ బాక్స్ లు నిండిపోతున్నాయి. పైగా ఈ పార్టీ లో వీరితో పాటు మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల కూడా ఉన్నారు. దీనితో అసలు దీని వెనుక రీజన్ ఏంటో తెలుసుకోవాలనే క్యూరియారిసిటీ అందరిలో పెరిగిపోయింది. ఇంతకి అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇండస్ట్రీ కి సన్నిహితంగా ఉండే ఓ బిజినెస్ మ్యాన్ ఇచ్చిన ఓ ప్రైవేట్ పార్టీ అది . ఆ పార్టీ కోసం వీరంతా మాల్దీవులకు వెళ్లారు. ఆ సమయంలో దిగిన ఫోటోనే ఈ ఫోటో. ఇంత మంది హీరోలను ఒకేచోట చూడడంతో.. ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఇక వారి సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కు దగ్గర్లో ఉంది. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికి వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా కోసం చిరు విశ్వంభర మూవీ వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. కానీ ఇంతవరకు కొత్త డేట్ ను అయితే ప్రకటించలేదు. ఇక మహేష్ బాబు కోసం జక్కన్న లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నాడు. వీలైనంత త్వరగా షూట్ స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక నాగార్జున , అఖిల్ సినిమాలకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్స్ లేవు. సో మళ్ళీ ఈ స్టార్ హీరోలంతా ఎప్పుడు మీట్ అవుతారో తెలియదు కానీ.. ఆ ఫోటో మాత్రం వారితో పాటు వారి అభిమానులకు కూడా ఓ మంచి మెమరీలా మిగిలిపోతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom