iDreamPost
android-app
ios-app

Sampath Ram: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సలార్ నటుడు! ఏం జరిగిందంటే?

  • Published Aug 28, 2024 | 8:41 PM Updated Updated Aug 29, 2024 | 1:07 PM

Salaar Actor Sampath Ram Met With Accident: తమిళ స్టార్ యాక్టర్ సంపత్ రామ్ యాక్సిడెంట్ లో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డ అతడిని వెంటనే దగ్గరోని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Salaar Actor Sampath Ram Met With Accident: తమిళ స్టార్ యాక్టర్ సంపత్ రామ్ యాక్సిడెంట్ లో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డ అతడిని వెంటనే దగ్గరోని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Aug 28, 2024 | 8:41 PMUpdated Aug 29, 2024 | 1:07 PM
Sampath Ram: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సలార్ నటుడు! ఏం జరిగిందంటే?

కోలీవుడ్ ప్రముఖ నటుడు సంపత్ రామ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చెన్నై గిండి సమీపంలో అతడు ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దాంతో సంపత్ రామ్ కారు వెనక భాగం నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు సంపత్. అతడిని వెంటనే దగ్గరోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని, ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

తమిళ స్టార్ యాక్టర్ సంపత్ రామ్ యాక్సిడెంట్ లో గాయపడ్డాడు. అతడు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొట్టడంతో.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్వల్పంగా గాయపడిన అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని, వైద్యులు కొన్ని రోజులు రెస్ట్ సూచించారని తెలుస్తోంది. కాగా.. సంపత్ రామ్ 1999లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ముల్తువన్’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో విలన్ గా, పోలీస్ ఆఫీసర్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించాడు.

సంపత్ రామ్ తెలుగులో స్పైడర్, అరణ్య, 1945, నేననాతో పాటుగా ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సలార్ లో కూడా యాక్ట్ చేశాడు.వీటితో పాటుగా లేటెస్ట్ విక్రమ్ హిట్ మూవీ తంగలాన్ లో కీలక పాత్రలో మెరిశాడు. ఇప్పటి వరకు తన కెరీర్ లో 75కు పైగా తమిళ్ సినిమాల్లో నటించాడు.ఈ నేపథ్యంలో అతడికి కారు యాక్సిడెంట్ జరిగిందని తెలియడంతో అభిమానులు,నెటిజన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇక ఈ యాక్సిడెంట్ పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet