iDreamPost
android-app
ios-app

అవంతిక వందనపు కి అరుదైన గౌరవం.. స్టార్స్ హీరోయిన్స్ అందుకోలేనిది!

  • Published May 16, 2024 | 9:24 PM Updated Updated May 16, 2024 | 9:24 PM

తెలుగు తెర నుండి హాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై మెరిసిన అందం అవంతిక వందనపు. ఈ ఏడాది ఓ వెబ్ సిరీస్ తో ఫుల్ ఫాంలోకి వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ప్రముఖ మ్యాగజైన్ కోసం ఫోటోలకు ఫోజులిచ్చింది.

తెలుగు తెర నుండి హాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై మెరిసిన అందం అవంతిక వందనపు. ఈ ఏడాది ఓ వెబ్ సిరీస్ తో ఫుల్ ఫాంలోకి వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ప్రముఖ మ్యాగజైన్ కోసం ఫోటోలకు ఫోజులిచ్చింది.

  • Published May 16, 2024 | 9:24 PMUpdated May 16, 2024 | 9:24 PM
అవంతిక వందనపు కి అరుదైన గౌరవం.. స్టార్స్ హీరోయిన్స్ అందుకోలేనిది!

అమ్మ చేసింది మిస్.. లైట్‌గానే ఉంటుంది అంటూ ఫార్చూన్ సన్ ఫ్లవర్ యాడ్‌లో చిన్నప్పుడే తన హవాభావాలతో మెప్పించిన అచ్చ తెలుగు అమ్మాయి అవంతిక వందనపు. ఈ ప్రకటన ఆమె లైఫ్‌ను మార్చేసింది. చైల్డ్ ఆర్టిస్టుగా వరుస ఆఫర్లు వచ్చాయి. బ్రహ్మోత్సవం, రారండోయ్ వేడుక చూద్దాం, ప్రేమమ్, మనమంతా, బాలకృష్ణుడు, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, బాబు బాగా బిజీ వంటి చిత్రాల్లో బాల నటిగా మెరిసి.. ఇప్పుడు ఒక్కసారిగా హాలీవుడ్ చిత్రాల్లో గ్లామరస్ పాత్రలో కనిపించే సరికి కళ్లుమిటకరించి చూశారు మన తెలుగు ప్రేక్షకులు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన యాన్సియంట్‌పై విమర్శలు కూడా చేశారు. ఇక్కడేమో అలా.. హాలీవుడ్ చిత్రాల్లో ఇలానా అంటూ నెగిటివ్ కామెంట్స్ చేశారు. వాటిపై కూడా స్పందించింది అవంతిక.

అవంతిక.. ఆమెరికాలోని కాలిఫోర్నియాలో పుట్టి పెరిగిన పక్కా హైదరాబాదీ గర్ల్. కేవలం ఆమె యాక్టర్ మాత్రమే కాదు.. క్లాసికల్ డ్యాన్సర్, సింగర్, మోడల్, యాక్టర్, ఆర్టిస్టు కూడా. 10 ఏళ్ల వయసులో నటనపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ బాల నటిగా అలరించి.. తిరిగి అమెరికా వెళ్లిపోయింది. అక్కడ చదువుకుంటూనే హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. 2021లో డిస్నీ ఛానెల్ రూపొందించిన స్పిన్, మ్యాక్సీ, సీనియర్ ఇయర్, మీన్ గర్ల్స్ వంటి చిత్రాల్లో నటించింది. కాగా, అయితే ఆమె ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చింది. మీన్ గర్ల్స్ కొనసాగింపుగా వచ్చిన ‘బిగ్ గర్ల్స్ డోంట్ క్రై’ వెబ్ సిరీస్‌లో. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ సందర్భంగా ఆమె అమెరికన్ యాన్సియెంట్‌పై కొంత మంది విమర్శలు, ట్రోల్స్ చేశారు.

వీటన్నింటిని తిప్పికొడుతూ.. ముందుకు సాగుతుంది. కాగా, విమర్శకుల నోళ్లను తిప్పికొడుతూ నటనతోనే సమాధానం చెబుతుంది. మీన్ గర్ల్స్ చిత్రంలో అవంతిక నటనకు గానూ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్శిటీ హార్వర్డ్ విశ్వవిద్యాలయం మెచ్చి.. ఆమెకు సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ టాప్ హీరోయిన్లకు సైతం సాధ్యం కానీ రేర్ ఫీట్ సాధించింది. ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై మన తెలుగుమ్మాయి అవంతిక వందనపు దర్శనమిచ్చింది. హాలీవుడ్‌లో రాణిస్తున్న బ్లాక్ బ్యూటీస్‌ని హైలెట్ చేసే గలొరి మ్యాగజైన్ కవర్ పేజీకి ఆమె ఫోజులిచ్చింది. ఇందులో వైట్ అండ్ సిల్వర్ డ్రెస్సులో.. సాగర కన్యలా స్టిల్ ఇచ్చింది అవంతిక. గ్రే క‌ల‌ర్ హెయిర్, గ్రే క‌ల‌ర్ డ్రెస్‌ల్లో కూడా కనిపిస్తూ.. తన హాట్ లుక్స్ లో మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by avantika (@avantika)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbahsegel girişgrandpashabet