Krishna Kowshik
తన డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ స్టార్ నటుడు ఇళయ దళపతి విజయ్. ఇప్పుడు మరో కొత్త జర్నీని స్టార్ చేశాడు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా పార్టీ పేరు ప్రకటించాడు విజయ్.
తన డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ స్టార్ నటుడు ఇళయ దళపతి విజయ్. ఇప్పుడు మరో కొత్త జర్నీని స్టార్ చేశాడు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా పార్టీ పేరు ప్రకటించాడు విజయ్.
Krishna Kowshik
కోలీవుడ్ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశాడు. ఎప్పటి నుండో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడన్న వార్తలు రాగా, ఇప్పుడు అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. విజయ్ కొత్త పార్టీ పేరును ప్రకటించాడు. ఆయన పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం. పార్టీ ఎజెండా త్వరలో ప్రకటిస్తానంటూ వెల్లడించాడు విజయ్. ‘తమిళనాడులో అవినీతి పాలన సాగుతోంది, అవినీతి నిర్మూలనే నా థ్యేయం. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ ’అంటూ చెప్పాడు విజయ్. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరుసగా సామాజిక కార్యక్రమాలు చేయడంతో పాటు తన సేవా సంస్థ విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో సమావేశం నిర్వహించడంతో దాదాపుగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి.
విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్ర శేఖర్. తమిళనాటే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. ఆయన తండ్రి ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్. చైల్డ్ ఆర్టిస్టుగా సినీ కెరీర్ స్టార్ చేసిన విజయ్.. నాలియ తీర్పు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. అనతి కాలంలో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. నన్బన్ (తెలుగులో స్నేహితుడు) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ స్టార్ నటుడికి..తెలుగు నాట కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తుపాకీ, జిల్లా, కత్తి, పులి, తేరీ (పోలీసోడు), మెర్సల్ (అదిరింది), బిగిల్, మాస్టర్, బీట్స్ మూవీలతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పాగా వేశాడు. వారసుడు, లియో ఇక్కడ కూడా భారీ కలెక్షన్లను రాబట్టుకున్న సంగతి విదితమే. ఇప్పుడు ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక.. పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించాడు విజయ్.
ఇది చదవండి: రాజకీయాల్లోకి ఇళయదళపతి విజయ్.. సినిమాలకు గుడ్ బై..?