iDreamPost
android-app
ios-app

ఆ మూవీలో నా యాక్టింగ్ నాకే నచ్చలేదు.. షూట్​లోనే తెలిసిపోయింది: తమన్నా

  • Author singhj Published - 02:17 PM, Mon - 31 July 23
  • Author singhj Published - 02:17 PM, Mon - 31 July 23
ఆ మూవీలో నా యాక్టింగ్ నాకే నచ్చలేదు.. షూట్​లోనే తెలిసిపోయింది: తమన్నా

తెలుగు, తమిళంతో పాటు హిందీ ప్రేక్షకులను కూడా తన​ అందం, అభినయంతో ఎంతగానో అలరిస్తున్నారు తమన్నా. ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపుగా 18 ఏళ్లు కావొస్తోంది. కెరీర్​ బిగినింగ్​లో ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే అందంగా కనిపిస్తున్నారు మిల్కీ బ్యూటీ. ఒకరకంగా చెప్పాలంటే ఆమె వయసు పెరుగుతున్న కొద్దీ మరింత అందంగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్ రేసులోకి దూసుకొచ్చారు తమన్నా. టాలీవుడ్, కోలీవుడ్​లో పెద్ద హీరోల సరసన చేస్తూనే మెళ్లిగా బాలీవుడ్ వైపు ఫోకస్ చేశారు.

హిందీ చిత్రాలు చేసే క్రమంలో గ్లామర్​ షోకు తెరలేపారు మిల్కీ బ్యూటీ. అందాల ప్రదర్శనకు అడ్డు చెప్పకుండా బోల్డ్ క్యారెక్టర్లతో యూత్ ఆడియెన్స్​ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఆమె నటించిన ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ లాంటి వెబ్ సిరీస్​లు చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. ఈ రెండు సిరీస్​ల్లో ఆమె నటన, గ్లామర్​కు అంతా ఫిదా అయ్యారు. హిందీలో ఆమె పాపులారిటీ బాగా పెరిగింది. ప్రస్తుతం ఆమె ఒకవైపు వెబ్ సిరీస్​లు చేస్తూనే.. మరోవైపు సినిమాల్లోనూ యాక్ట్ చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.

తమన్నా వరుసగా సీనియర్ హీరోల సినిమాల్లో సందడి చేయనున్నారు. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్​తో ‘జైలర్​’ చిత్రంలో నటిస్తున్న మిల్కీ బ్యూటీ.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి పక్కన ‘భోళా శంకర్​’ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఆగస్టు రెండో వారంలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. గతంలో తాను నటించిన ‘సుర’ ఫిల్మ్ గురించి చెప్పారు. దళపతి విజయ్ కెరీర్​లో బిగ్గెస్ట్​ ఫ్లాప్​గా నిలిచిన ఈ మూవీ పరాజయానికి గల కారణాన్ని ఆమె వివరించారు. ఆ సినిమా అంటే తనకు చాలా ఇష్టమన్నారు తమన్నా.

‘సుర’ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయన్నారు తమన్నా. అయితే మూవీలోని కొన్ని సీన్స్​లో తన నటన తనకే నచ్చలేదన్నారు. షూటింగ్ టైమ్​లోనే పలు సీన్స్ సరిగా రాలేదని తెలిసిపోయిందన్నారు. దీంతో దీని గురించి అప్పుడే ఓ అంచనాకు వచ్చామన్నారు. కానీ యాక్టర్స్ ఒప్పకున్న తర్వాత సినిమాను కచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు తమన్నా. మూవీ ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్​తో సంబంధం లేకుండా ముందుకెళ్లాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని.. ఇది ప్రొఫెషన్​లో ఒక భాగం అని తమన్నా పేర్కొన్నారు.