iDreamPost
android-app
ios-app

10 ఏళ్ల ప్రేమ.. ప్రియుడితో రహస్య వివాహనికి సొట్ట బుగ్గల సుందరి రెడీ..!

  • Published Feb 28, 2024 | 11:58 AM Updated Updated Feb 28, 2024 | 11:58 AM

టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోయిన్లు.. వరుసగా వివాహ జీవితంలోకి అడుగుపెడుతున్నారు. మొన్న లావణ్య త్రిపాఠి, నిన్న రకుల్ ప్రీత్ సింగ్, అక్షలు.. వారు మనస్సు ఇచ్చిన వ్యక్తులను మనువాడారు. ఇప్పుడు.. మరో బ్యూటీ పెళ్లికి సిద్దమైంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోయిన్లు.. వరుసగా వివాహ జీవితంలోకి అడుగుపెడుతున్నారు. మొన్న లావణ్య త్రిపాఠి, నిన్న రకుల్ ప్రీత్ సింగ్, అక్షలు.. వారు మనస్సు ఇచ్చిన వ్యక్తులను మనువాడారు. ఇప్పుడు.. మరో బ్యూటీ పెళ్లికి సిద్దమైంది.

  • Published Feb 28, 2024 | 11:58 AMUpdated Feb 28, 2024 | 11:58 AM
10 ఏళ్ల ప్రేమ.. ప్రియుడితో రహస్య వివాహనికి సొట్ట బుగ్గల సుందరి రెడీ..!

టాలీవుడ్ బ్యూటీస్ అంతా.. ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాము మనసు పడ్డ వ్యక్తితో కలిసి.. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. లావణ్య త్రిపాఠి, మెగా వారసుడు వరుణ్ తేజ్‌ను గత ఏడాది నవంబర్‌లో మనువాడిన సంగతి విదితమే. ఇదే నెలలో రకుల్ ప్రీత్ సింగ్- యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీని వివాహం చేసుకుంది. అలాగే మరో తెలుగు నటి అక్ష కూడా.. బాలీవుడ్ సినిమాటోగ్రాపర్ కౌశల్‌తో ఏడడుగులు వేసింది. వీరందరివీ కూడా లవ్ మ్యారేజెస్ కావడం విశేషం. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతుంది. పదేళ్ల ప్రేమను మూడు ముళ్లతో బంధంతో వారి రిలేషన్ మరింత ధృడంగా చేసుకునేందుకు సిద్దమైంది. ఇంతకు ఆమె ఎవరంటే.. సొట్టల బుగ్గల సుందరి తాప్సీ పన్ను.

తాప్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఈ ఢిల్లీ భామ పరిశ్రమలోకి అడుగు పెట్టింది తెలుగు మూవీతోనే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఝమ్మంది నాదం సినిమాతో తన కెరీర్ స్టార్ట్ చేసిన ముద్దుగుమ్మ.. అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోలతో నటించింది. ప్రభాస్, రవితేజ, గోపిచంద్, వెంకటేష్ వంటి టైర్ 1 హీరోలతో జత కట్టింది. తమిళ్, మలయాళ చిత్రాల్లో వర్క్ చేస్తూనే బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ కూడా స్టార్ హీరోలతోనే తెరపంచుకుంది తాప్సీ పన్ను. అక్కడ కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూ.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. తాజాగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ సరసన డంకీ చిత్రంలో నటించింది. ఇందులో ఆమె నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు బ్యూటీ తన బ్యాచులర్ లైఫ్ కు స్వస్థి చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.

తాప్సీ పన్ను తన బాయ్‌ఫ్రెండ్, బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్‌ను వివాహం చేసుకోనుందని తెలుస్తోంది. కాగా, వీరిద్దరూ 10 సంవత్సరాలకు పైగా రిలేషన్‌లో ఉన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో అతడితో రిలేషన్ గురించి బయట పెట్టింది తాప్సీ పన్ను. ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. వచ్చే నెల చివరిలో ఈ సొట్ట బుగ్గల సుందరి ప్రియుడ్ని మనువాడనుందని సమాచారం. ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. అయితే ఈ వివాహం రహస్యంగా జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే ఈ పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ స్టార్లకు సైతం ఆహ్వానం లేదని టాక్. ఇక వీరి వివాహం సిక్కు, క్రైస్తవ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఆమె నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఎందుకంటే.. తాను పెళ్లి చేసుకుంటే.. అందరికీ చెప్పి చేసుకుంటానని గతంలో స్టేట్ మెంట్ ఇచ్చింది అమ్మడు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటుందో, లేదో వెయిట్ చేయాలి. ప్రస్తుతం ఆమె మూడు హిందీ ప్రాజెక్టుల్లో నటిస్తుంది ఈ భామ.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss