iDreamPost
android-app
ios-app

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ ఇంట తీవ్ర విషాదం!

  • Published May 30, 2024 | 6:20 PM Updated Updated May 30, 2024 | 6:20 PM

Suryadevara Radha Krishna: ఇటీవల కాలంలో సినీ, రాజకీయ రంగాల్లో విషాదం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.

Suryadevara Radha Krishna: ఇటీవల కాలంలో సినీ, రాజకీయ రంగాల్లో విషాదం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.

  • Published May 30, 2024 | 6:20 PMUpdated May 30, 2024 | 6:20 PM
టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ ఇంట తీవ్ర విషాదం!

ఇటీవల కాలంలో సినీ, రాజకీయ రంగాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన పలువురు వివిధ కారణాలతో మరణిస్తున్నారు. అనారోగ్యం, రోడ్డు ప్రమాదం, ఆత్మహత్య, గుండె పోటు వంటి కారణాలతో ప్రముఖులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇక వారి మరణంతో  కుటుంబ సభ్యులతో పాటు వారి అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేస్తుంది. అలానే పలువురు ప్రముఖల ఇళ్లలో విషాదాలు చోటుచేసుకుంటాయి. ఇటీవలే ఓ మోడల్ ఆత్మహత్య చేసుకుంది. తాజాగా ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.

టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు)  గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పలు సినిమాలకు, సీరియల్స్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. వారు అనేక సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగాఉన్నారు. ఆయన  ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గురువారం ఆయనకు మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి సూర్యదేవర నాగేంద్రమ్మ(90) కన్నుమూశారు. ఆమె చాలా కాలం నుంచి వృద్ధాప్యంతో బాధ పడుతున్నారు. అలానే కొంతకాలం నుంచి హృదయ సంబంధిత వ్యాధితో ఆమె బాధ పడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం నాగేంద్రమ్మ తుదిశ్వాస విడిచారు. సూర్యదేవర నాగేంద్రమ్మ కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు సంతానంగా ఉన్నారు.

సూర్యదేవర రాధాకృష్ణ రెండవ కుమాడు.  ఆయన హరికా, హాసిని క్రియేషన్ లో అనేక సినిమాలను నిర్మించారు. ఇక ప్రముఖ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీకి ఆమెకు మనవడు అవుతారు. శుక్రవారం ఉదయం పది గంటలకు ఫిల్మ్ నగర్‌లోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ఈ శుక్రవారమే రిలీజ్‌ కానుంది. ఈ సమయంలో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఇక ఆమె మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  సితారా ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో నాగవంశీ సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పలు సినిమాలతో నాగ్ వంశీ బిజీగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో వారింట విషాదం చోటుచేసుకుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet