iDreamPost
android-app
ios-app

Surya s/o Krishnan: సూర్య s/o కృష్ణన్ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే!

  • Published Feb 08, 2024 | 12:40 PM Updated Updated Feb 08, 2024 | 12:40 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది మళ్ళీ రీరిలీజ్ ట్రెండ్ మొదలైంది. ఇప్పుడు తాజాగా దాదాపు 15ఏళ్ల క్రితం విడుదలైన హీరో సూర్య సినిమాను రీరిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది మళ్ళీ రీరిలీజ్ ట్రెండ్ మొదలైంది. ఇప్పుడు తాజాగా దాదాపు 15ఏళ్ల క్రితం విడుదలైన హీరో సూర్య సినిమాను రీరిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

  • Published Feb 08, 2024 | 12:40 PMUpdated Feb 08, 2024 | 12:40 PM
Surya s/o Krishnan: సూర్య  s/o కృష్ణన్ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే!

తెలుగు వారికీ సినిమా అంటే అదొక ప్రత్యేకమైన అభిమానం. థియేటర్ లో ఏ సినిమా రిలీజ్ అయినా.. ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఇప్పటి తరం వారికీ పాత సినిమా ఫ్లేవర్స్ ను పరిచయం చేస్తున్నట్లుగా.. తెలుగు చిత్ర పరిశ్రమలో రీరిలీజ్ ట్రెండ్ మొదలైంది. ఈ రీరిలీజ్ బాటిలో విడుడుదలవుతున్న ప్రతి చిత్రాన్ని.. సినీ ప్రియులు ఎంతో ఉత్సాహంగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది “కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు” చిత్రంతో.. రీరిలీజ్ ట్రెండ్ మొదలైంది. అలానే బాలకృష్ణ నటించిన “సమరసింహా రెడ్డి” చిత్రం రీరిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు మేకర్స్. ఇక ఇప్పుడు ఆల్రెడీ గత ఏడాది థియేటర్ లో సందడి చేసిన రీరిలీజ్ చిత్రం “సూర్య s/o కృష్ణన్”. థియేటర్ లో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడంతో.. ఈ ఏడాది మళ్ళీ ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

ఇప్పటికి .. ఎప్పటికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్ లో .. గుర్తుండిపోయే ది బెస్ట్ మూవీ ఏది అంటే.. అందరు నిస్సందేహంగా చెప్పేది.. “సూర్య s/o కృష్ణన్” చిత్రం గురించే. డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో.. సమీరా రెడ్డి, దివ్య స్పందన, సిమ్రాన్ కీలకపాత్రలు పోషించారు. ఇందులో సూర్య తండ్రీ, కొడుకు పాత్రలలో ద్విపాత్రాభినయం చేశాడు. 2008లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అప్పట్లోనే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈసినిమా ఆడియన్సు ముందుకు రాబోతుంది. ఆల్రెడీ గత ఏడాది ఆగస్టులో ఈ చిత్రం రీరిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక ఆ సమయంలో థియేటర్లలో సూర్య అభిమానులు చేసిన హడావిడి అంత ఇంత కాదు. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలకు అందరు ఫిదా అయిపోవాల్సిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా హడావిడే కనిపించింది. ఇక ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా రీరిలీజ్ అంటే .. ఈ సారి థియేటర్ లో ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గడం ఉండదు. ఈసారి ఈ సినిమా ఎటువంటి హడావిడి చేస్తోందో చూడాలి.

అయితే, ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఈ ఏడాది.. వాలెంటైన్స్ డే రోజున అంటే ఫిబ్రవరి 14న మళ్ళీ తెలుగులో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో రెండు సార్లు థియేటర్ లో విడుదుల అయ్యి.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం .. ఇప్పుడు మూడో సారి రీరిలీజ్ అంటే ఈసారి వచ్చే రెస్పాన్స్ ఇంకాస్త గట్టిగానే ఉంటుదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ చిత్రానికి హరీష్ జై రాజ్ మ్యూజిక్ ను అందించారు. ఈ చిత్రంలో సూర్య , సమీరా రెడ్డి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా హైలెట్ అవుతాయి. అయితే , ఇప్పటివరకు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ ప్రేమ కథ చిత్రాలను తెరకెక్కించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్.. తనకు మాత్రం “సూర్య s/o కృష్ణన్” మూవీ చాలా ప్రత్యేకమని .. గతంలో చాలా సార్లు చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను .. మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet