iDreamPost
android-app
ios-app

మల్టీస్టారర్ కోసం సూర్య – దుల్కర్! డైరెక్టర్ ఎవరంటే..?

  • Author Soma Sekhar Published - 07:07 PM, Fri - 28 July 23
  • Author Soma Sekhar Published - 07:07 PM, Fri - 28 July 23
మల్టీస్టారర్ కోసం సూర్య – దుల్కర్! డైరెక్టర్ ఎవరంటే..?

ప్రస్తుతం ఏ సినిమా ఇండస్ట్రీలో చూసినా పాన్ ఇండియా మూవీస్, మల్టీస్టారర్ మూవీసే ఎక్కువగా వినపడుతున్నాయి. స్టార్ డైరెక్టర్ల నుంచి యంగ్ డైరెక్టర్ల వరకు పాన్ ఇండియా లేదా మల్టీస్టారర్ కథలే ఎక్కువగా హీరోలకు వినిపిస్తూ వస్తున్నారు. ఇక కథలు నచ్చడంతో హీరోలు సైతం మల్టీస్టారర్ మూవీస్ కు ఒకే చెబుతున్నారు. అయితే ఇండస్ట్రీలో కొన్ని యునిక్ కాంబినేషన్లు ఉంటాయి. వారు ఒక్కసారి కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి కాంబినేషనే త్వరలో రాబోతుంది. స్టార్ హీరో సూర్య, యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కలిసి ఓ మల్టీస్టారర్ మూవీలో నటించబోతున్నారు. ఇంతకు ముందు సూర్యకు సూపర్ హిట్ అందించిన డైరెక్టరే సూర్య 43 సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

హీరో సూర్య-దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో త్వరలోనే ఓ సినిమా పట్టాలెక్కబోతోంది. ఇందుకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ GV ప్రకాశ్ కుమార్ ఓ ఈవెంట్ లో ఈ సినిమా గురించి మాట్లాడాడు. సూర్యకి ‘ఆకాశమే నీ హద్దురా’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలోనే సూర్య 43 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలోకి తాజాగా వచ్చి చేరాడు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్. వీరిద్దరి కాంబినేషన్ లో సుధా కొంగర ఓ భారీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేసింది. దాంతో సోషల్ మీడియాలో సూర్య 43 ట్రెండింగ్ లో ఉంది.

కాగా మెుదటగా దుల్కర్ పాత్రను కార్తీతో చేయించాలని అనుకున్నారట. కానీ కొన్ని కారణాల తర్వాత ఈ పాత్రకు దుల్కర్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన లీక్ ను తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ ఓ మూవీ ఈవెంట్ లో మాట్లాడుతూ.. సుధా కొంగర డైరెక్షన్ లో హీరో సూర్యతో ఓ సినిమా చేస్తున్నాను. అది నా 100వ సినిమా అని జీవీ ప్రకాశ్ కుమార్ చెప్పడంతో.. ఈ మూవీపై క్లారిటీ వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తో కలిసి 2D ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తారని ఇండస్ట్రీ టాక్. మరి సూర్య-దుల్కర్ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by WAWA ORIGINALS (@wawa_originals)


ఇదికూడా చదవండి: OTTలోకి ‘రంగబలి’.. స్టీమింగ్ ఎందులో? ఎప్పటినుంచంటే?