iDreamPost

OTTలోకి ‘రంగబలి’.. స్టీమింగ్ ఎందులో? ఎప్పటినుంచంటే?

  • Author Soma Sekhar Updated - 11:33 PM, Thu - 2 November 23
  • Author Soma Sekhar Updated - 11:33 PM, Thu - 2 November 23
OTTలోకి ‘రంగబలి’.. స్టీమింగ్ ఎందులో? ఎప్పటినుంచంటే?

థియేటర్లలో మిస్ అయిన సినిమాలను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. ఇక హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా కోసం అయితే వేయి కళ్లతో ఎదురుచూస్తారు మూవీ లవర్స్. ఇటీవల కాలంలో యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా సక్సెస్ అందుకున్న సినిమా ‘రంగబలి’. నాగశౌర్య హీరోగా యుక్తి తరేజ హీరోయిన్ గా కలిసి నటించిన సినిమా. ఈ సినిమాకు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించారు. జులై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యూత్ ను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్దం అవుతోంది. మరి ఏ ఓటీటీలో, ఏ రోజునుంచి రంగబలి స్ట్రీమింగ్ అవుతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

రంగబలి.. నాగశౌర్య, యుక్తి తరజా జంటగా డైరెక్టర్ పవన్ బాసంశెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. జులై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యూత్ ఎంటర్ టైనర్ గా మంచి టాక్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా నాగశౌర్య, సత్యల కామెడీ ట్రాక్ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పాలి. కాగా.. సినిమా ప్రమోషన్లలో భాగంగా.. ప్రముఖులను సత్య ఇమిటేషన్ చేసిన ఇంటర్య్వూతో రంగబలికి ఎక్కడా లేని హైప్ వచ్చింది. దాంతో తొలిరోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది రంగబలి. మురళి శర్మ, బ్రహ్మాజి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం.. త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ ఓటీటీ అయిన నెట్ ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 4న రంగబలి స్ట్రీమింగ్ కానుంది. దాంతో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ కోసం ఎదురుచూస్తున్న ఎదురుచూపులకు తెరపడినట్లు అయ్యింది.


ఇదికూడ చదవండి: వీడియో: థియేటర్లో పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. స్క్రీన్ ని చింపేసి రచ్చ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి