iDreamPost
android-app
ios-app

Surekha Vani: నాకు ఎవరితోనో ఎఫైర్లు ఉన్నాయి అనుకుంటున్నారు! నటి సురేఖా వాణి కన్నీళ్లు!

  • Published Mar 13, 2024 | 3:35 PM Updated Updated Mar 13, 2024 | 3:35 PM

ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండే యాక్టర్స్ అందరిలో కంటే.. నటి సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రీత కు సంబంధించిన వీడియోస్ ఏ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేఖ వాణి.. తన వ్యక్తిగత విషయాల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండే యాక్టర్స్ అందరిలో కంటే.. నటి సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రీత కు సంబంధించిన వీడియోస్ ఏ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేఖ వాణి.. తన వ్యక్తిగత విషయాల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

  • Published Mar 13, 2024 | 3:35 PMUpdated Mar 13, 2024 | 3:35 PM
Surekha Vani: నాకు ఎవరితోనో ఎఫైర్లు ఉన్నాయి అనుకుంటున్నారు! నటి సురేఖా వాణి కన్నీళ్లు!

సురేఖ వాణి ఇప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి.. ప్రేక్షకులను అలరించింది. వెండితెరపై ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈమె సినిమాలలో అంతగా కనిపించకపోయినా కూడా.. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ఆమెతో పాటు ఆమె కూతురు సుప్రీత కూడా అందరికి పరిచయమే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ తల్లీ కూతుర్లు ఇద్దరు కూడా బాగా ఫేమస్. అలాగే, వీరిపై ట్రోలింగ్స్ కూడా అదే విధంగా వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి సురేఖ ఆమెపై వస్తున్న ట్రోలింగ్స్ పై స్పందించింది. దీనికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సురేఖ వాణి మాట్లాడుతూ.. “మొగుడు పోయిన తర్వాత విచ్చలవిడిగా మారిందంటూ నన్ను ట్రోల్‌ చేస్తున్నారు. నాకు 19 ఏళ్లకే డైరెక్టర్‌ సురేశ్‌ తేజతో పెళ్లయింది. అప్పుడు పెద్దదానిలా మారిపోయాను. ఇప్పుడు నాకు 42 ఏళ్లు.. ఇరవైఏళ్ల పిల్లలా నా కూతురితో ఎంజాయ్‌ చేస్తున్నాను. నా భర్త ఉన్నా ఇలాగే ఉండేదాన్ని. మొదట్లో ఈ కామెంట్స్‌ చూసి భరించలేకపోయాను. తర్వాత వీళ్లు మారరని వదిలేశాను. ప్రతివాడి నోరు మూయించలేం కదా.. నాగురించి వీడియోలు తీస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. సింగిల్‌ పేరెంట్‌ను, కాబట్టి ఇలాంటి విమర్శలు, ఎత్తిపొడుపులు ఎలాగో ఉంటాయి. అలాగే, నా భర్త ఆరోగ్యం బాగోలేనప్పుడు నేనసలు పట్టించుకోలేదని తేజ వాళ్ల కుటుంబసభ్యులు తప్పుగా అనుకున్నారు. అతడికి డయాబెటిస్‌ ఉండటంతో గుండెలో నొప్పి తెలియలేదు. సడన్‌గా హార్ట్‌ బీట్‌ ఆగిపోయింది. . కనీసం కలలో అయినా తేజ కనిపిస్తే తనతో మాట్లాడాలనుంది. తనను క్షమించమని అడగాలనుంది.” అంటూ సురేఖ తన భర్త గురించి చెప్పుకొచ్చింది.

Surekhavani emotional

అలాగే, తనకు ఎవరితోనో ఎఫైర్లు ఉన్నాయంటూ వస్తున్న రూమర్స్ పై స్పందిస్తూ.. “నాకు ఎవరితోనో ఎఫైర్లు ఉన్నాయి. అందుకే లగ్జరీగా బతుకుతున్నానని చాలామంది అనుకుంటున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. ఈ మధ్యే నా ప్రాపర్టీ కూడా అమ్మేశాను. ఇప్పటివరకు నాకు సొంతిల్లు కూడా లేదు. కేపీ చౌదరి డ్రగ్స్‌ కేసులో నన్ను అనవసరంగా ఇరికించారు. అప్పుడు నేను మానసికంగా ఎంత నరకం చూశానో.. నెలరోజులు డిప్రెషన్‌లో ఉండిపోయాను. ముద్ద దిగక.. ఏడుస్తూ కూర్చుండిపోయా.. మీ చెడు తిరుగుళ్ల వల్లే ఇదంతా అని నోటికొచ్చింది తిట్టారు. నేను అమెరికాకు వెళ్తే పారిపోయిందన్నారు. అక్కడికి వెళ్లొచ్చాక ఈ కామెంట్లను పట్టించుకోవడం మానేశాను. ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించమని తిరుమలస్వామివారిని కోరుతూ గుండు చేయించుకున్నాను” అంటూ నటి సురేఖ వాపోయారు. మరి, సురేఖ వాణి తనపై వస్తున్న రూమర్స్ గురించి స్పందించిన విషయంలో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişivermectin tabletMadridbet girişMadridbet girişMadridbetmeritbetCasibom GirişmeritbetsuperbetinTophillbetJojobet GirişcasibomCasibom GirişHoliganbetgalabetHoliganbetMarsbahis GirişCasibomJojobetHoliganbetJojobet