iDreamPost
android-app
ios-app

ముందు వెకేషన్.. తరువాత ప్రమోషన్! గుంటూరోడి స్కెచ్ రెడీ!

  • Published Nov 17, 2023 | 9:25 PM Updated Updated Nov 17, 2023 | 9:25 PM

ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ కు సంబంధించిన వెకేషన్, సినిమా ప్రమోషన్స్ గురించిన విషయం నెట్టింటా వైరల్ గా మారింది.

ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ కు సంబంధించిన వెకేషన్, సినిమా ప్రమోషన్స్ గురించిన విషయం నెట్టింటా వైరల్ గా మారింది.

  • Published Nov 17, 2023 | 9:25 PMUpdated Nov 17, 2023 | 9:25 PM
ముందు వెకేషన్.. తరువాత ప్రమోషన్! గుంటూరోడి స్కెచ్ రెడీ!

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కెతున్న సినిమా గుంటూరు కారం. వీరి కాంబోలో వస్తున్న ఈ చిత్రం మూడోది. దీంతో ఈ సినిమాపై మహేష్ ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతేడాది డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కార్ వారిపాటతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ గుంటూరు కారంతో మరోసారి హిట్ కొట్టి తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతంపైగానే పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హీరో మహేష్ కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింటా వైరల్ గా మారింది.

షూటింగ్ నుంచి విరామం దొరికితే చాలు తన సమాయాన్ని భార్యా పిల్లలతోనే గడిపేస్తుంటారు మహేష్. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్తుంటారు ప్రిన్స్. ఈ క్రమంలో న్యూ ఇయర్ దగ్గరపడుతున్న వేళ మరోసారి వెకేషన్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే గుంటూరు కారం సినిమాకు సంబంధించిన వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని డిసెంబర్ నెలాఖరులో న్యూ ఇయర్ వెకేషన్ కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెకేషన్ నుంచి తిరిగొచ్చిన తరువాతనే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనేటట్లు గుంటూరోడు స్కెచ్ రెడీ వేసినట్లు టాక్ వినిపిస్తోంది.

గుంటూరు కారంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా మీనాక్షి చౌదరి మరియు యంగ్ సెన్సేషన్ శ్రీలీల లు హీరోయిన్స్ గా అలరించబోతున్నారు. ఈ సినిమానుహారిక హాసిని క్రియేషన్స్, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. గుంటూరు కారం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. రీసెంట్ గుంటూరు కారం సినిమా నుంచి దమ్ మసాలా అనే సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈసాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. జనవరి 12 2024 న గుంటూరు కారం సినిమాను వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş