iDreamPost
android-app
ios-app

చెప్పిన టైమ్ కంటే ముందే వస్తున్న సందీప్ కిషన్!

  • Published Feb 10, 2024 | 1:41 PM Updated Updated Feb 10, 2024 | 1:41 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి కంటెంట్ తో సినిమాలు తీసే వారిలో హీరో సందీప్ కిషన్ ఒకరు. తాజాగా ఈ హీరో నటించిన చిత్రం "భైరవకోన" . అయితే ఈ చిత్రం అనుకున్నదానికంటే ముందే .. థియేటర్లల్లోకి వస్తున్నట్లు సమాచారం. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి కంటెంట్ తో సినిమాలు తీసే వారిలో హీరో సందీప్ కిషన్ ఒకరు. తాజాగా ఈ హీరో నటించిన చిత్రం "భైరవకోన" . అయితే ఈ చిత్రం అనుకున్నదానికంటే ముందే .. థియేటర్లల్లోకి వస్తున్నట్లు సమాచారం. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

  • Published Feb 10, 2024 | 1:41 PMUpdated Feb 10, 2024 | 1:41 PM
చెప్పిన టైమ్ కంటే ముందే వస్తున్న సందీప్ కిషన్!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలే కాకుండా .. వారితో పోటీ పడుతున్న ఎంతో మంది చిన్న హీరోలు కూడా ఉన్నారు. ప్రతి సారి వారు కూడా మంచి కంటెంట్ తో .. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ, కొన్ని సార్లు ఎదో ఒక లోపం వలన వారి సినిమాలు ఆడియన్సును అంతగా ఆకట్టుకోలేకపోవచ్చు. ఈ క్రమంలో .. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎంతో మంది ఉన్నారు. ఈ కోవకు చెందినవాడే హీరో “సందీప్ కిషన్”. ఎప్పటికపుడు తన లుక్ ని మార్చుకుని.. ప్రేక్షకులకు కొత్తగా కనిపిస్తూ.. మంచి కంటెంట్ ను అందిస్తూ ఉంటాడు ఈ హీరో. ఈ క్రమంలో గత ఏడాది రిలీజ్ అయిన మైకేల్ మూవీ డిసాస్టర్ కావడంతో.. తన సినిమాపై తానే కామెంట్స్ చేసుకున్న వార్తలను చూసాము. ఇక ఇప్పుడు తాజాగా ఈ హీరో నటిస్తున్న చిత్రం “భైరవ కోన”. అయితే , ఈ సినిమాను అనుకున్న దానికంటే ముందే విడుదల చేస్తున్నారంట మేకర్స్.

భైరవ కోన చిత్రానికి వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, మొదట ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్ . ఈ క్రమంలో చిత్ర బృందం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వూస్ తో మూవీ ప్రమోషన్లను గ్రాండ్ గా చేస్తున్నారు. చూడబోతుంటే ఈసారి ఈ చిత్రంతో మంచి హిట్ సాధించాలని అనుకుంటున్నట్టు ఉన్నాడు ఈ హీరో. అయితే, ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. “భైరవ కోన” విడుదల తేదీని అనుకున్నదానికంటే రెండు రోజులు ముందు అంటే .. ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల చేస్తున్నామని .. మూవీ టీమ్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. దీనితో ఈ చిత్రం అనుకున్న దానికంటే ముందే థియేటర్లలోకి రానుంది.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ , ట్రైలర్ ను చూస్తుంటే .. ఇదొక సూపర్ నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం అని అర్థమౌతోంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్యతాపర్ ప్రధాన పాత్రలలో నటించారు. కాగా, ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఇక హాస్య మూవీస్ బ్యానర్‌పై.. రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మాతగా వ్యవహరించారు. మరి ఈ సినిమా థియేటర్ లలో విడుదల అయిన తర్వాత ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి , “భైరవ కోన” చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetjojobetCasibom girişjojobetJojobet GirişcasibomjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin