iDreamPost
android-app
ios-app

ఏడేళ్లకు విడుదలకు నోచుకుంటున్నసందీప్ కిషన్ చిత్రం

  • Published Mar 30, 2024 | 11:20 AM Updated Updated Mar 30, 2024 | 11:20 AM

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి కాంబోలో వచ్చిన చిత్రం ఎట్టకేలకు విడుదలకు నోచుకుంటుంది. 2017 చివరిలో తమిళంలో విడుదలై హిట్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది.

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి కాంబోలో వచ్చిన చిత్రం ఎట్టకేలకు విడుదలకు నోచుకుంటుంది. 2017 చివరిలో తమిళంలో విడుదలై హిట్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది.

  • Published Mar 30, 2024 | 11:20 AMUpdated Mar 30, 2024 | 11:20 AM
ఏడేళ్లకు విడుదలకు నోచుకుంటున్నసందీప్ కిషన్ చిత్రం

టాలీవుడ్ టాలెంట్ యంగ్ హీరోల్లో ఒకరు సందీప్ కిషన్. సినిమాటోగ్రాఫర్స్ చోటా కే నాయుడు, శ్యామ్ కే నాయుడుల మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనను తాను నిరూపించుకున్నాడు. ఇటీవల వరుస హిట్స్ అందుకుంటూ మంచి జోష్ మీదున్నాడు. తమిళంలో నటించిన మైఖేల్, కెప్టెన్ మిల్లర్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద అలరించిన సంగతి విదితమే. అలాగే ఇటీవల వచ్చిన ఊరి పేరు భైరవ కొన మూవీతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. వి ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 16 నుండి థియేటర్లలో సందడి చేసింది. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లు. ఇటీవల ఓటీటీలోకి వచ్చి మంచి వ్యూస్ రాబట్టుకుంది ఈ చిత్రం. అయితే ఇప్పుడో ఇంట్రస్టింగ్ అప్ డేట్ వచ్చింది. ఏడేళ్ల క్రితం పూర్తయ్యి కేవలం కోలీవుడ్ ప్రేక్షకులను అలరించిన సందీప్ కిషన్ మూవీ మాయవన్ (ప్రాజెక్ట్ 2)కు ఎట్టకేలకు మోక్షం కలిగింది.

2017 డిసెంబర్ 14న మాయవన్ పేరుతో కోలీవుడ్ నాట విడుదలై హిట్ అందుకున్న సందీప్ కిషన్ చిత్రం తెలుగులో కూడా ప్రాజెక్ట్ Z పేరుతో డబ్ చేశారు. సినిమా టీజర్, థియేట్రికల్ రిలీజ్ కూడా విడుదలైంది కానీ.. సినిమా మాత్రం విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు ఈ సినిమాకు ఎట్టకేలకు విముక్తి కలిగింది. త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. కోలీవుడ్‌లో విడుదలైన ఏళ్లకు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. ప్రాజెక్ట్ 2 మూవీకి సివి కుమార్ కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్. జాకీష్రాఫ్, డేనియల్ బాలాజీ, జయ ప్రకాష్, దర్శకుడు కే ఎస్ రవికుమార్, మైమ్ గోపీ, భాగవతి పెరుమాళ్ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో మంచి హిట్ అందుకుంది. లావణ్య, సందీప్ కిషన్ జోడీగా నటించిన మరో చిత్రం ఏ 1 ఎక్స్ ప్రెస్ 2021లో రిలీజై అలరించింది.

2018లో ప్రాజెక్ట్ Z తెలుగులో విడుదల కావాల్సిన చిత్రం.. వాయిదా పడుతూ వచ్చింది. చివరకు విడుదలకు సిద్దమైంది. ఎట్టకేలకు ఏప్రిల్6న రిలీజ్ చేయనుంది సినీ యూనిట్. అంటే.. మలయాళ సర్వైవల్ మూవీ మంజుమ్మల్ బాయ్స్‌కు పోటీగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మంజుమ్మల్ బాయ్స్ తెలుగు వర్షన్ కూడా ఆ రోజే థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. ప్రాజెక్ట్ జెడ్ మూవీలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించాడు సందీప్. రెండు భాషల్లో ఏకకాలంలో మంచి హీరోగా పేరు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాడు సందీప్ కిషన్. టాలీవుడ్ చిత్రాలతో పాటు కోలీవుడ్‌లో కూడా పేర్లల్‌గా సినిమాలు చేస్తున్నాడు. మాయవన్ తర్వాత వరుస పెట్టి తెలుగు సినిమాలు చేశాడు. మనస్సుకు నచ్చింది. నెక్ట్స్ ఏంటీ? నిను వీడని నీడను నేనే, తెనాలి రామకృష్ణ, ఏ 1 ఎక్స్ ప్రెస్, వివాహ భోజనంబు (కీ రోల్) చేశాడు.  కానీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బ్లాక్ బస్టర్ తరహా హిట్ కొట్టలేకపోయాడు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş