iDreamPost
android-app
ios-app

సుజిత్.. పాత పవన్ ని పరిచయం చేయబోతున్నాడా? లెక్క మార్చాడు!

  • Author ajaykrishna Published - 03:19 PM, Sat - 2 September 23
  • Author ajaykrishna Published - 03:19 PM, Sat - 2 September 23
సుజిత్.. పాత పవన్ ని పరిచయం చేయబోతున్నాడా? లెక్క మార్చాడు!

ఇండస్ట్రీలో కొన్నిసార్లు హీరోలు తమ మార్క్ ని వదిలేసి సినిమాలు చేస్తుంటారు. హీరోలు ఎలాంటి సినిమాలు చేసినా అభిమానులు ఆదరించడానికి సిద్ధంగానే ఉంటారు. కానీ.. హీరో తన మార్క్ ని ఎందుకు వదిలేశాడు? మళ్లీ ఎప్పుడు తన మార్క్ కనిపించేలా సినిమాలు చేస్తాడు? అని ఎదురు చూస్తుంటారు. అవును.. మొదట్లో కొంతమంది హీరోలకు వాళ్ళు చేసిన క్యారెక్టరైజేషన్స్ ద్వారా ఫేమ్ వస్తుంటుంది. ఇంకొందరికి ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా.. వాళ్ళ స్టైల్ ఆఫ్ మేనరిజం జోడించి ఆకట్టుకుంటారు. ఇవన్నీ రీమేక్ సినిమాలలో ట్రై చేయలేరు. ఎందుకంటే.. రీమేక్ సినిమాలంటేనే ఆల్రెడీ ఓ భాషలో హిట్ అయిన సినిమాని.. అందులో హీరో క్యారెక్టర్ ని కాపీ కొట్టడం కిందకి వస్తుంది.

అలాంటప్పుడు రీమేక్స్ నుండి కొత్తదనం ఎక్స్ పెక్ట్ చేయలేం. కానీ.. ఒరిజినల్ స్టోరీస్ మాత్రం పక్కాగా తమ ట్రెండ్ మార్క్ ని చూపించే అవకాశం ఉంటుంది. క్యారెక్టరైజేషన్ ని అలా బిల్డ్ చేసుకోవచ్చు కూడా. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ మూవీ విషయంలో అదే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ బర్త్ డే కావడంతో.. OG నుండి గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ లో ఇప్పటిదాకా చూడని పవన్ ని చూపించి సర్ప్రైజ్ చేశాడు సుజిత్. సాహో తర్వాత నాలుగేళ్లకు ఈ సినిమా చేస్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.

అసలు ఎవరు అంచనా వేయలేని రీతిలో గ్యాంగ్ స్టర్ క్యారెక్టర్ లో పవన్ ని ప్రెజెంట్ చేశాడు. పవన్ కళ్యాణ్ కి పేరొచ్చింది.. ఆయన చేసిన డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ తో. బద్రి, తమ్ముడు, ఖుషి, గబ్బర్ సింగ్.. ఇలాంటి సినిమాలన్నీ పవన్ క్యారెక్టరైజేషన్ మీదే నడిచాయి. అలాంటిది కొన్నాళ్ళుగా రీమేక్ సినిమాలలో చిక్కుకొని తన మార్క్ ని దూరం పెట్టేసాడు పవన్. ఇప్పుడు అదే మార్క్ ని పట్టుకొని.. దర్శకుడు సుజిత్ OG ని రెడీ చేసినట్లు గ్లింప్స్ చూస్తే అర్ధమవుతుంది. కేవలం ఇన్నాళ్లు మిస్ అయిన పవన్ మార్క్ క్యారెక్టరైజేషన్ పైనే ఫోకస్ పెట్టాడని గ్లింప్స్ లో పవన్ మేనరిజం, స్టైల్ చూస్తే తెలుస్తుంది. అంటే.. ఓ రకంగా పాత పవన్ ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడని, లెక్కలన్నీ మార్చేశాడని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఓజి విజువల్స్ కి నెక్స్ట్ లెవెల్ లో కనెక్ట్ అయిపోయారు ఫ్యాన్స్. మరి సినిమా వచ్చాక పవన్ క్యారెక్టరైజేషన్ ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక ఓజి గ్లింప్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.