iDreamPost
android-app
ios-app

సుడిగాలి సుధీర్ మాస్ డ్యాన్స్! ఇందుకు కదా బుల్లితెర మెగాస్టార్ అనేది!

  • Published Apr 05, 2024 | 7:33 PM Updated Updated Apr 05, 2024 | 7:33 PM

Sudigali Sudheer- Ugadi 2024: బుల్లితెర మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ స్మాల్ స్క్రీన్ కి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే చాలా గ్యాప్ తర్వాత సుధీర్ బ్లాస్టిగ్ పర్మార్మెన్స్ తో ఇరగదీశాడు.

Sudigali Sudheer- Ugadi 2024: బుల్లితెర మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ స్మాల్ స్క్రీన్ కి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే చాలా గ్యాప్ తర్వాత సుధీర్ బ్లాస్టిగ్ పర్మార్మెన్స్ తో ఇరగదీశాడు.

  • Published Apr 05, 2024 | 7:33 PMUpdated Apr 05, 2024 | 7:33 PM
సుడిగాలి సుధీర్ మాస్ డ్యాన్స్! ఇందుకు కదా బుల్లితెర మెగాస్టార్ అనేది!

సుడిగాలి సుధీర్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక చిన్న మెజీషియన్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోగా కొనసాగుతున్నాడు. నిజానికి బుల్లితెరలో కెరీర్ ప్రారంభించినా కూడా.. చిన్ సైజ్ హీరోకి ఉండే ఫాలోయింగ్ సుధీర్ కి ఉండేది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. సుడిగాలి సుధీర్ గురించి ప్రస్తావన ఉండేది. సుధీర్ ఆర్మీ ఫుల్ యాక్టివ్ గా ఉండేది. అలాంటి సుధీర్ బుల్లితెరకు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సుడిగాలి సుధీర్ బుల్లితెర మీద మెరిశాడు. కేవలం కనిపించడం మాత్రమే కాకుండా.. అదిరపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు కూడా.

సుడిగాలి సుధీర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో, సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సుధీర్ కోసం నెట్టింట పెద్దఎత్తున యుద్ధాలే జరిగేవి. అసలు సుధీర్ కి సంబంధంలేని వీడియో కింద కూడా సుధీర్ అన్న తోపు అంటూ కామెంట్స్ పెట్టేవాళ్లు. కమెడియన్ గా, యాంకర్ గా ఉన్నప్పుడే సుధీర్ కి చోటా హీరోకి ఉన్నంత ఫాలోయింగ్ ఉండేది. బుల్లితెర మెగాస్టార్ అంటూ కామెంట్లతో హోరెత్తించేవాళ్లు. ఇప్పుడు సుధీర్ హీరోగానే వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు. అయితే జబర్దస్త్ లాంటి షోకి మాత్రం దూరంకాక తప్పలేదు. అటు సినిమాలు, ఇటు కామెడీ షోస్ అంటే కాల్ షీట్స్ తో ఇబ్బంది అవతోందని బుల్లితెరకు దూరమైన విషయం తెలిసిందే.

ఆ తర్వాత సుధీర్ లేని లోటును బుల్లితెర ప్రేక్షకులు ఫీలవుతూనే ఉన్నారు. అందుకే సుధీర్ అవకాశం ఉన్నప్పుడల్లా బుల్లితెర మీద మెరుస్తూ ఉంటాడు. తాజాగా ఉగాది ఈవెంట్లో సుడిగాలి సుధీర్ హంగామా చేశాడు. ‘ఈసారి పండగ మనదే’ అనే ఈవెంట్ లో సుధీర్ పాల్గొన్నాడు. ఆ ఈవెంట్లో ఫ్యామిలీ స్టార్ టీమ్ విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్, దిల్ రాజు కూడా పాల్గొన్నారు. సాధారణంగానే పండగ ఈవెంట్ అంటే కామెడీ స్కిట్లు, టన్నుల కొద్దీ పంచ్ డైలాగులు, వావ్ అనిపించే డాన్సులు ఉంటాయి. ఈసారి వావ్ మాత్రమే కాకుండా డబుల్ వావ్ అంటున్నారు.

ఈసారి పండగ మనదే ఈవెంట్ ఎందుకంత స్పెషల్ అంటే చాలా రోజుల తర్వాత సుడిగాలి సుధీర్ తన డాన్స్ తో ఇరగదీశాడు. సుధీర్ మల్టీ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇన్నాళ్లు సుధీర్ డాన్స్ మిస్ అయిన ప్రేక్షకులకు ఇది ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. మహేశ్ గుంటూరు కారం మూవీలోని కుర్చీని మడతపెట్టి సాంగ్ తో సుడిగాలి సుధీర్ స్టేజ్ ని దడదడ లాడించేశాడు. చాలా గ్యాప్ తర్వాత తన విశ్వరూపం చూపించాడు. డాన్స్ తో ఇరగదీశాడు. ప్రస్తుతం సుధీర్ మాస్ డ్యాన్స్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి.. చాలా గ్యాప్ తర్వాత డాన్స్ తో దున్నేసిన సుధీర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet