iDreamPost
android-app
ios-app

ప్రణీత్ హనుమంతు వివాదం.. క్షమాపణలు కోరిన స్టార్ హీరో

  • Published Jul 08, 2024 | 7:36 PM Updated Updated Jul 08, 2024 | 7:36 PM

Tollywood Hero Reacts On Phanumanthu Issue: ప్రణీత్ హనుమంతు ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు ఉండరు. డార్క్ కామెడీ పేరుతో స్వచ్ఛమైన తండ్రీ, కూతుర్ల బంధంపై జుగుప్సాకరమైన కామెంట్స్ చేసి వివాదంలో ఇరుక్కున్నాడు. ఇతని విషయంలో సాయి ధరమ్ తేజ్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. కాగా హనుమంతు విషయంలో టాలీవుడ్ స్టార్ హీరో క్షమాపణలు కోరారు. ఎందుకంటే?

Tollywood Hero Reacts On Phanumanthu Issue: ప్రణీత్ హనుమంతు ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు ఉండరు. డార్క్ కామెడీ పేరుతో స్వచ్ఛమైన తండ్రీ, కూతుర్ల బంధంపై జుగుప్సాకరమైన కామెంట్స్ చేసి వివాదంలో ఇరుక్కున్నాడు. ఇతని విషయంలో సాయి ధరమ్ తేజ్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. కాగా హనుమంతు విషయంలో టాలీవుడ్ స్టార్ హీరో క్షమాపణలు కోరారు. ఎందుకంటే?

  • Published Jul 08, 2024 | 7:36 PMUpdated Jul 08, 2024 | 7:36 PM
ప్రణీత్ హనుమంతు వివాదం.. క్షమాపణలు కోరిన స్టార్ హీరో

ప్రణీత్ హనుమంతు ప్రస్తుతం ఇతని పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో నానుతున్న పేరు. డార్క్ కామెడీ పేరుతో యూట్యూబ్ లో సెలబ్రిటీల మీద, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, దారుణంగా జోకులు వేసి వీడియోలను పెడుతుంటారు. ఇతనితో పాటు మరో నలుగురైదుగురు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీరంతా గత కొన్ని రోజులుగా రోస్టింగ్, డార్క్ కామెడీ పేరుతో అభ్యంతరకరంగా, అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ వచ్చారు. దాన్ని చాలా మంది ఎంజాయ్ చేస్తూ వచ్చారు. అయితే రీసెంట్ గా ఒకే ఒక్క వీడియో వీరి జీవితాలని తలకిందులు చేసేసింది. డార్క్ కామెడీ అని చెప్పి తండ్రీ, కూతుర్ల పవిత్రమైన రిలేషన్ పై నీచాతి నీచంగా కామెంట్స్ చేశారు. ఆ వీడియో చూస్తే ఎవ్వరికైనా కోపం రావడం సహజం. దీనిపై సాయి ధరమ్ తేజ్ సహా పలువురు సెలబ్రిటీలు సీరియస్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి వరకూ ఈ ఇష్యూని తీసుకెళ్లారు. ఇతనిపై పోక్సో యాక్ట్ కేసు పెట్టాలని సూచించారు. తెలంగాణ పోలీసులు కూడా తగిన చర్యలకు సిద్ధమయ్యారు. కాగా ప్రణీత్ హనుమంతు విషయంలో తప్పు చేశామని స్టార్ హీరో క్షమాపణలు చెప్పారు.  

మంచి కోసమో, చెడు కోసమో.. నేను సోషల్ మీడియా వ్యక్తిని కాను.. లేదా ఈ విషయాలను కొనసాగించను. ప్రణీత్ హనుమంతుని హరోంహర సినిమాలో తీసుకున్నందుకు అసహ్యంగా ఉంది. మా హరోంహర సినిమా బృందం నుంచి అలానే నా నుంచి క్షమాపణలు కోరుతున్నా. ఈ వ్యక్తి ఇలాంటి వాడన్న విషయం మాకు తెలియదు. నాకు అతని గురించి అస్సలు తెలియదు. సోషల్ మీడియాలో అతని గురించి బయటపడ్డ విషయాలను చూసేందుకు కూడా నాకు ధైర్యం సరిపోలేదు. ఇలాంటి వాటి గురించి తలచుకుంటేనే వాంతి అవుతుంది.. కానీ ఇలాంటప్పుడే మనం దృష్టి పెట్టాలి.

ఇలాంటి వాళ్ళని సోషల్ మీడియా వేదికల మీద అనుమతించకూడదు. ఇంత దారుణమైన మైండ్ ఉన్న మనుషులకు ఎలాంటి ప్లాట్ ఫామ్ దొరక్కూడదు. ఇదసలు భావ ప్రకటన స్వేచ్ఛ కాదు’ అంటూ హీరో సుధీర్ బాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ప్రణీత్ హనుమంతు హరోంహర సినిమాలో నటించిన విషయం తెలిసిందే. కంటెంట్ క్రియేటర్ గా, యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రణీత్ హనుమంతు.. డార్క్ కామెడీ వీడియోలతో ఒక్కసారిగా చీకటిలోకి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. మరి ప్రణీత్ హనుమంతు చేసిన పనికి సుధీర్ బాబు క్షమాపణలు కోరడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş