Swetha
మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రం "ప్రేమలు". ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ అంత ఇంత కాదు. ఈ సినిమా తెలుగులోకి డబ్ చేసిన తర్వాత.. స్టార్ డైరెక్టర్స్ సైతం ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ ప్రేమలు మూవీ సక్సెస్ మీట్ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రం "ప్రేమలు". ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ అంత ఇంత కాదు. ఈ సినిమా తెలుగులోకి డబ్ చేసిన తర్వాత.. స్టార్ డైరెక్టర్స్ సైతం ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ ప్రేమలు మూవీ సక్సెస్ మీట్ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.
Swetha
మార్చి 8న మలయాళీ సినిమా అయిన ప్రేమలు మూవీ థియేటర్స్ లో సందడి చేసింది. దానికి ముందే వచ్చిన ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే ఈ సినిమాకు సూపర్ సక్సెస్ సాధించడంతో.. తెలుగు ప్రేక్షకుల నుంచి లభించిన విశేష ఆదరణతో.. ఈ సినిమాను తెలుగు కూడా డబ్ చేశారు మేకర్స్. అప్పటికే హిట్ ట్రాక్ లో నడుస్తున్న ప్రేమలు మూవీని.. తెలుగులో కూడా రిలీజ్ చేయడంతో.. ఇక ఎక్కడ చూసినా ఈ సినిమాపై ప్రశంసల వర్షమే కురిసింది. స్టార్ డైరెక్టర్స్, సెలబ్రిటీస్ సైతం ఈ సినిమాపై ట్వీట్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్స్ చేశారు. ఇక “ప్రేమలు” సినిమా సక్సెస్ మీట్ ను తాజగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో దర్శక ధీరుడు రాజమౌళి, అనిల్ రావిపూడి, అనుదీప్ లాంటి స్టార్ డైరెక్టర్స్ గెస్ట్స్ గా వచ్చారు. ఈ క్రమంలో రాజమౌళి “ప్రేమలు” సినిమా గురించి చాలా క్లియర్ గా మాట్లాడారు. ప్రస్తుతం ఈ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా, “ప్రేమలు” మూవీ సక్సెస్ మీట్ కు అటెండ్ అయిన రాజమౌళి .. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. “మలయాళంలో ఈ సినిమా పెద్ద హిట్ అని నేను విన్నాను. అయితే ఈ లవ్ స్టోరీలు నాకు పెద్దగా ఎక్కవు. మనకంతా యాక్షన్ సినిమాలు ఉండాలి. అందుకే పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండానే ఈ సినిమా చూడటానికి వెళ్లాను. కానీ థియేటర్లో అడుగుపెట్టిన తర్వాత, మొదటి 15 నిమిషాలు కాకుండా.. ఆ తర్వాత నుంచి సినిమా పూర్తయ్యే వరకు.. పొట్ట చక్కల్లయ్యేలా నవ్వుతూనే ఉన్నాను. ఇది థియేటర్లో అందరూ కలిసి చూడాల్సిన సినిమా. ఫోన్‌లో చూసి ఎంజాయ్ చేసే సినిమా కాదు. మనల్ని ఇంతగా నవ్వించిన ఈ క్రెడిట్ ఫస్ట్ రైటర్‌కి దక్కుతుంది. మలయాళం డైలాగులు ఏంటో తెలీదు కానీ.. తెలుగులో మాత్రం డైలాగ్స్ ఇరగదీశాడు. ఇక యాక్టింగ్ విషయానికొస్తే చాలా జెలసీగా, బాధతో ఒప్పుకోవాల్సింది ఏంటంటే మలయాళం వాళ్లు చాలా బెటర్ యాక్టర్స్.
నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు మమిత నాకు చాలా నచ్చింది. భవిష్యత్తులో ఈ అమ్మాయే కుర్రాళ్ల క్రష్ అవుతుంది అనిపించింది. గీతాంజలిలో గిరిజ వచ్చినట్లు.. సాయి పల్లవి వచ్చినట్లు.. మమిత కూడా వస్తుంది. ఇక ఈ సినిమాలో హీరో సచిన్‌ను చూసినప్పుడు.. రియల్ లైఫ్‌లో అలాంటి క్యారెక్టర్ చూస్తే డిప్ప మీద కొట్టాలనిపిస్తుంది. సరదాగా అన్నా కానీ.. చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. ఇక ఈ సినిమాలో నాకు నచ్చిన బెస్ట్ క్యారెక్టర్ మాత్రం ‘ఆది’. అసలు ఈ క్యారెక్టర్ ఎంత చిరాకు తెప్పిస్తుందంటే పట్టుకొని కొట్టాలనిపిస్తుంది. మా డ్రైవర్ కూడా వచ్చేటప్పుడు తెగ తిట్టాడు.. సార్ సాఫ్ట్ వేర్ వాళ్లంతా అలానే ఉంటారు అన్నాడు. అందరూ అలా ఎందుకుంటారురా బాబూ అని వాదించాను. లేదు సార్ మా ఇంటికి పక్కన ఒక ఐటీ వాడు ఉండేవాడు సేమ్ ఆది లానే ఉంటాడంటూ మైకులో చెప్పలేనన్ని బూతులు తిట్టాడు.” అంటూ ప్రేమలు సినిమా గురించి ప్రతి విషయాన్నీ చెప్పుకొచ్చారు దర్శక ధీరుడు రాజమౌళి. అయితే, టాలీవుడ్ లోని ఓ స్టార్ డైరెక్టర్ ఒక డబ్బింగ్ సినిమా గురించి ఇంతలా ప్రశంసించడం అందరికి.. ఆశ్చర్యంగా అనిపించింది. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
With some jealousy & a bit of pain, we all may have to accept that the Malayalam film industry always produces better actors, says S S Rajamouli at #PremaluTelugu Success Meet pic.twitter.com/fYfDGJtqrw
— Aakashavaani (@TheAakashavaani) March 12, 2024