iDreamPost
android-app
ios-app

SSMB29: మహేశ్-రాజమౌళి మూవీపై క్రేజీ అప్డేట్! ఇది ఫ్యాన్స్ కు సంతోషమే..

  • Published Jul 04, 2024 | 1:31 PM Updated Updated Jul 04, 2024 | 1:31 PM

SSMB29.. SS రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం. ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఆ అప్డేట్ ఏంటంటే?

SSMB29.. SS రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం. ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఆ అప్డేట్ ఏంటంటే?

  • Published Jul 04, 2024 | 1:31 PMUpdated Jul 04, 2024 | 1:31 PM
SSMB29: మహేశ్-రాజమౌళి మూవీపై క్రేజీ అప్డేట్! ఇది ఫ్యాన్స్ కు సంతోషమే..

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం ఈ చిత్రం తెరకెక్కబోతోంది. హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీ చిత్రీకరించాలని జక్కన్న మెరుగులు దిద్దుతున్నాడు. ఇక ఈ మూవీ గురించి రోజుకో అప్డేట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. కథ పూర్తికాగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను శరవేగంగా చేస్తున్నాడు రాజమౌళి. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

SSMB29.. ప్రస్తుతం ఇండస్ట్రీ మెుత్తం ఈ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇందులో హీరోగా నటిస్తుండటం, అగ్ర దర్శకుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటం, పైగా జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందివ్వడంతో.. ఈ మూవీపై హై రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ నెలకొన్నాయి. అమెజాన్ అడవుల్లో సాగే అడ్వెంచరల్ యాక్షన్ గా ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో జక్కన్న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడు.

కాగా.. SSMB29 కథ పూర్తి అయినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా పూర్తి చేయాలని చూస్తున్నాడు రాజమౌళి. ఇక ఈ చిత్రాన్ని జక్కన్న సెప్టెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నాడట. అందుకు అన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. అందులో భాగంగానే.. హైదరాబాద్ లో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీకి సంబంధించిన సెట్ వర్క్ ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. పలు రకాల సెట్స్ ను డిజైన్ చేయిస్తున్నారట జక్కన్న. అందులో ఆఫీస్ సెట్ ముఖ్యమైందని, ఎక్కువ భాగం షూటింగ్ ఇందులోనే జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ప్రస్తుతం రెడీ చేస్తున్న ఏదో ఒక సెట్ లో సెప్టెంబర్ లో షూట్ కి వెళ్లాలని ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ అట. ఇక ఈ చిత్రానికి సంబంధించి నటీ, నటులు ఎంపిక జరుగుతోంది. ఈ మూవీలో విలన్ గా మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ను తీసుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. కాగా.. సెప్టెంబర్ లో చిత్రం ప్రారంభం అవుతుందని తెలియడంతో  ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోను ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın alCasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibom