iDreamPost

ఆగని కల్కి 2898 AD సునామీ.. వారం రోజుల కలెక్షన్లు ఎంతంటే..?

రెబలోడి స్టామినా ఏంటో మరోసారి రుజువు చేసిన చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టింది. ఫస్ట్ వీక్ సక్సెస్ ఫుల్ జర్నీతో ఎండింగ్ అయ్యింది. ఈ వారం రోజుల్లో మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే...?

రెబలోడి స్టామినా ఏంటో మరోసారి రుజువు చేసిన చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టింది. ఫస్ట్ వీక్ సక్సెస్ ఫుల్ జర్నీతో ఎండింగ్ అయ్యింది. ఈ వారం రోజుల్లో మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే...?

ఆగని కల్కి 2898 AD సునామీ..  వారం రోజుల కలెక్షన్లు ఎంతంటే..?

బాక్సాఫీసు వద్ద రెబల్ స్టార్ ప్రభాస్ ఊచకోత అప్రతిహతంగా కొనసాగుతోంది.కాటేరమ్మ కొడుకు అనుకుంటే.. భైరవ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు. పౌరాణిక, ఇతిహాస గాధలకు.. సైన్స్ ఫిక్షన్ మిళితం చేసి నాగ్ అశ్విన్ చేసిన’కల్కి 2898 AD’ ప్రయోగం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. అందుకే బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. జూన్ 27న సినిమా రిలీజ్ కాగా, బ్రహ్మాండమైన షోలతో కాసుల వర్షం కురుస్తుంది. ప్రభాస్ మేనియా.. అమితాబ్, కమల్, దీపికా అదనపు ఆకర్షణగా నిలవడంతో సినిమా పాజిటివ్ రివ్యూస్, రేటింగ్స్‌తో దూసుకెళ్లిపోతుంది. వీరికి తోడు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు క్యామియో పాత్రలు. విజయ్ దేవరకొండ టూ రాజమౌళిలాంటి స్టార్ హీరోస్, డైరెక్టర్, హీరోయిన్స్ కనువిందు చేశారు.

ఈ మంగళవారం వరకు అనగా ఈ ఆరు రోజుల్లో కల్కి టీం ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టుకుంది. ఇక సాక్‌నిల్క్ ప్రకారం బుధవారం కూడా ప్రపంచ వ్యాప్తంగా 22.7 కోట్లు కొల్లగొట్టింది. ‘కల్కి 2898 AD’ ఈ వారం రోజుల్లో ఇండియాలో రూ. 393 కోట్ల కలెకన్లను వసూలు చేసింది. ఈ తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 750 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ వారంలో కాస్తంత తగ్గినా.. ఈ వారంలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో పాటు వీకెండ్‌లో సినిమా వీక్షించే వాళ్ల సంఖ్య పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో కల్కికి తిరుగు లేదని సినీ పండితుల అంచనా. ఈ లెక్కన వీకెండ్ నాటికి రూ. 800 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు. గత నెల 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో గ్రాండ్ గా రిలీజైంది కల్కి.

తొలి రోజే వరల్డ్ వైడ్‌గా రూ. 191 కోట్లను వసూలు చేసింది. రూ. 600 కోట్లతో ఈ మూవీని నిర్మించింది వైజయంతి మూవీస్. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన ఈ మైథాలజీ ప్లస్ సైన్ ఫిక్షన్ స్టోరీకి ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. పిల్లలు కూడా అమితంగా ఇష్టపడుతున్నారు. బుజ్జి కోసం సినిమా చూసేందుకు ఎంతో ఇంట్రస్ట్ చూపుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ కలెక్షన్లు, ఈ రేంజ్ క్రేజ్ చూసి ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. అలాగే సీక్వెల్ కోసం కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇక డార్లింగ్ ప్రభాస్ తన రికార్డులను తానే చెరుపుకుంటున్నాడు. సలార్ కలెక్షన్లను బీట్ చేసిన టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్. ఇండియాలోనే కాదు నార్త్ అమెరికాలో రికార్డుల మోత మోగిస్తున్నాడు. ప్రీమియర్ ప్రీ సేల్స్.. ఫాస్టెట్ 100 కోట్లు దాటిన మూవీ, నార్త్ అమెరికాలో అత్యధిక గ్రాసర్ మూవీగా నిలించింది. ఇక ఆయన సినిమాల లైనప్ కూడా పెద్దగానే ఉంది. కల్కి ఇచ్చిన బూస్టప్‌తో సలార్ 2 కోసం ప్రీపేర్ అవుతున్నాడు పాన్ ఇండియన్ స్టార్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి