iDreamPost
android-app
ios-app

SSMB 29: మహేష్ లుక్ కోసం అంతర్జాతీయ నిపుణులు!

మహేష్-రాజమౌళి కాంబోలో వస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ 29’ ఆడియెన్స్​ ఎక్స్​పెక్టేషన్స్​ను మరింత పెంచేస్తోంది. సూపర్​స్టార్ కోసం ఇంటర్నేషనల్ ఎక్స్​పర్ట్స్​ను దించుతున్నాడట జక్కన్న.

మహేష్-రాజమౌళి కాంబోలో వస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ 29’ ఆడియెన్స్​ ఎక్స్​పెక్టేషన్స్​ను మరింత పెంచేస్తోంది. సూపర్​స్టార్ కోసం ఇంటర్నేషనల్ ఎక్స్​పర్ట్స్​ను దించుతున్నాడట జక్కన్న.

SSMB 29: మహేష్ లుక్ కోసం అంతర్జాతీయ నిపుణులు!

ఉన్నచోట ఉండగలగడమే ఉన్నత స్థానం అన్నాడు లియో టాల్ స్టాయ్. దర్శకుడిగా జేమ్స్ కామెరూన్, స్పిల్ బర్గ్ వంటి వాళ్ళని కూడా దిగ్భ్రమకి గురి చేసిన నెంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి.. ప్రస్తుతం ఈ ఉన్న స్థానాన్ని కాపాడుకోగలిగితే చాలు. అందరికీ లభించే స్థాయి కాదిది. స్థానమూ కాదు. అందుకే ప్రతి విషయంలో రాజమౌళి ఎక్స్ ట్రా కేర్ తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అంతర్జాతీయంగా దుమ్ము లేపేసింది. ‘నాటు నాటు’ పాట భాష కూడా వెస్ట్రనర్స్ కూడా పాడుకునే స్థాయికి ట్రిపుల్ ఆర్ సంచలనం రేపింది. తర్వాత ఏంటి? అంటే ప్రతీ సినిమా ఒక అగ్ని పరీక్షే, ఒక యుద్ధమే. మహేష్ బాబుతో రాజమౌళి చేయబోతున్న తాజా చిత్రం గురించి జరుగుతున్న వ్యవహారం అంతా ఇంతా కాదు. అఫ్​కోర్స్.. జరుగుతన్నది కొంతయితే, దాని మీద జరిగే రాద్ధాంతం కొండంత. కాకపోతే కొన్ని మాత్రం తప్పనిసరిగా జరగాల్సినవి జరుగుతున్నాయన్నది మాత్రం పరిశ్రమలో మాట్లాడుకుంటున్నారు.

రాజమౌళి సినిమాలో చేసిన ప్రతీ హీరో ఇప్పటివరకూ తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారన్నది అందరూ అంగీకరించాల్సిందే. జక్కన్న కారణంగానే ఆయా హీరోలకి మార్కెట్ వాల్యూ పెరిగాయన్న దానికి ట్రేడే సాక్ష్యం. రాజమౌళి హీరోలు ఎలా కనిపిస్తారు, ఎలా కనిపించాలి, ఎలా కనిపిస్తే అది ఆయన మార్క్ అవుతుంది ఇవన్నీ పెద్ద చర్చలు. రెగ్యులర్ సినిమాల్లోలా కనిపిస్తే జక్కన్న చిత్రం అని అనిపించుకోనే అనిపించుకోదు. అందుకే రాజమౌళి అదనంగా, తెలివితేటలతో తీవ్రమైన కసరత్తు చేయాలి.

మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాకి రాజమౌళి ఆ కసరత్తులోనే నిమగ్నమై ఉన్నాడు. SSMB 29లో ప్రిన్స్ మహేష్ లుక్ మేకోవర్ కోసం ఇటీవలే జర్మనీ వెళ్ళొచ్చాడని సన్నిహితులు చెబుతున్నారు. ఫిజిక్ మెయింటెనెన్స్ కోసం కూడా తను తరచూ స్విట్జర్లాండ్ లో ఒక ప్రత్యేకమైన చోటుకి వెళ్ళి కొన్నాళ్ళు థెరపీలు తీసుకొని మరీ వస్తుంటాడని ఇండస్ట్రీలో చాలా ఇంట్రస్టింగ్ గా మాట్లాడుకుంటారు. అందుకే ఎన్నాళ్ళయినా మహేష్ బాబులో ఆ ప్రిన్స్ అనే ఛరిష్మా ఎక్కడా తగ్గదు.

మహేష్ బాబు ఇలా వర్కవుట్ చేస్తుంటే, మరోవైపు రాజమౌళి కథా చర్చల్లో పూర్తిగా తలమునకలై పని చేస్తున్నారు. ఇందులో రాజమౌళి ఫేస్ చేసే ఛాలెంజ్ ఏంటంటే.. మహేష్ ని ఎలా ప్రెజంట్ చేయాలి అన్నదే. ఇదే ఆయన ముందున్న పెద్ద పరీక్ష. దాని కోసమే జక్కన్న ఊపిరి సలపకుండా పనిచేస్తున్నారు. ఈ ఒక్క విషయం కోసం దాదాపు నెలరోజుల కాలాన్ని కేటాయించారట రాజమౌళి. అది కదా కమిట్​మెంట్ అంటే. కథంతా ఒకెత్తు అయితే, ఆ కథని లీడ్ చేసే హీరో లుక్ కూడా అంతకన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి. స్కెచ్ ఆర్టిస్టుల సాయం కూడా ఇక్కడ చాలా సీరియస్ గా మారింది. రకరకాల గెటప్స్, కాస్ట్యూమ్స్, హెయిర్ స్టయిల్స్.. ఇలా ప్రతీ చిన్న విషయం మీద రాజమౌళి నిమగ్నమై ఉన్నారు. ఇందుకోసం అంతర్జాతీయ నిపుణులను కూడా జక్కన్న రంగంలోకి దించుతున్నారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ రోజు రాజమౌళికి ఉన్న ఇంటర్నేషనల్ రికగ్నిషన్ రీత్యా, ఎవరిని పిలిచినా కళ్ళకద్దుకుని మరీ వచ్చి వాల్తారు. అదే జరుగుతోందిప్పుడు. మరి.. ‘ఎస్ఎస్ఎంబీ 29’లో మహేష్ లుక్ ఎలా ఉండబోతోందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న సింగర్‌ హారికా నారాయణ్‌.. వరుడెవరంటే..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి