iDreamPost
android-app
ios-app

అందరూ ఆ ఒక్కదాన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు: తమన్ అసహనం

  • Author Soma Sekhar Updated - 05:36 PM, Thu - 4 January 24
  • Author Soma Sekhar Updated - 05:36 PM, Thu - 4 January 24
అందరూ ఆ ఒక్కదాన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు: తమన్ అసహనం

సాధారణంగా ఇండస్ట్రీలో ఓ సినిమా అనౌన్స్ అయ్యిందంటే చాలు.. ఆ మూవీ విడుదల అయ్యేవరకు ఎన్నో విమర్శలు, వివాదాలు, ట్రోల్స్ వస్తుంటాయి. అయితే వాటిని మూవీ యూనిట్ అంతపెద్దగా పట్టించుకోరు. కానీ ఈ విమర్శలు ఎక్కువ అయితే మాత్రం మూవీ మేకర్స్ లేదా.. మూవీకి సంబంధించిన వ్యక్తులు రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. తాజాగా గత కొద్దిరోజులగా తనపై వస్తున్న విమర్శలు, ట్రోల్స్ పై స్పందించారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్. అందరు ఈ సినిమానే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకో నాకు అర్ధం కావట్లేదు అంటూ అసహనం వ్యక్తం చేశాడు.

SS తమన్.. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. స్టార్ హీరోలందరితో పనిచేస్తూ.. కెరీర్ లో దూసుకెళ్తున్నాడు తమన్. కానీ ఈ మధ్యకాలంలో తమన్ ఏ సాంగ్ రిలీజ్ చేసినా గానీ.. కాపీ కాపీ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ‘గుంటూరు కారం’ సినిమా విషయంలో ఈ ట్రోల్స్ మరింతగా ఎక్కువై పోయాయి. అసలు గుంటూరు కారం సినిమా తమన్ చేయట్లేదని పుకార్లు కూడా వచ్చాయి. దానికి కారణం లేకపోలేదు. ఈ సినిమా విషయంలో అనేక మార్పులు జరుగుతుండటంతో.. తమన్ కూడా ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

ఈ వార్తలు ఎక్కువ కావడంతో తమన్ స్వయంగా స్పందిచారు. సోమవారం మీడియాతో మాట్లాడిన తమన్..”అందరు నా సినిమాపైనే పడ్డారు. ఎందుకు ఈ సినిమానే టార్గెట్ చేస్తున్నారో నాకు అర్దం కావడం లేదు. కొన్ని సినిమాలు మూడు, నాలుగు సంవత్సరాలు షూటింగ్ జరుపుకున్న.. జరుపుకుంటున్న సినిమాలు ఉన్నాయి. కానీ వాటిని వదిలేసి గుంటూరు కారం సినిమాపైనే ఎందుకు పడ్డారో తెలీయట్లేదు” అంటూ అసహనం వ్యక్తం చేశాడు తమన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తుండగా.. శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. ఇక పూజా హెగ్డే స్థానంలో మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్-మహేష్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం కావడంతో.. ప్రేక్షకులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇటీవలే విడుదలైన గ్లింప్స్ మూవీపై అంచనాలను పెంచాయి. మహేష్ ఊరమాస్ లుక్ అభిమానులకు పూనకాలు తెప్పించిందనే చెప్పాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetpir girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş