iDreamPost
android-app
ios-app

Guntur Kaaram: తమన్, పూజా హెగ్డేలకు షాకిచ్చిన త్రివిక్రమ్! ‘గుంటూరు కారం’ నుంచి ఔట్!

  • Author Soma Sekhar Updated - 11:24 AM, Tue - 20 June 23
  • Author Soma Sekhar Updated - 11:24 AM, Tue - 20 June 23
Guntur Kaaram: తమన్, పూజా హెగ్డేలకు షాకిచ్చిన త్రివిక్రమ్! ‘గుంటూరు కారం’ నుంచి ఔట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం’గుంటూరు కారం’. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్, హీరోయిన్ గా పూజా హెగ్డే ను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. తమన్ స్థానంలో ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే ప్లేస్ లో మరో హీరోయిన్ ను తీసుకోనున్నట్లు సమాచారం.

గుంటూరు కారం.. సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం. అతడు, ఖలేజా తర్వాత ఈ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో.. అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ తమన్ ను ఎంపిక చేశారు. టైటిల్ గ్లింప్స్ కు తమనే మ్యూజిక్ అందించారు కూడా. కానీ కొన్ని కారణాల చేత గుంటూరు కారం నుంచి తమన్ వైదొలిగినట్లు తెలుస్తోంది. తమన్ స్థానంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ను తీసుకున్నట్లు సమాచారం.

గతంలో త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాకు అనిరుధే సంగీతం అందించారు. ఇక తమన్ తో పాటుగా గుంటూర్ కారం నుంచి స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సైతం వైదొలిగినట్లు సమాచారం. హీరో శర్వానంద్ నటిస్తున్న సినిమాలో పూజా హీరోయిన్ గా నటిస్తోంది. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో.. మహేష్ సినిమా నుంచి వైదొలిగినట్లు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. త్రివిక్రమ్ కు చాలా దగ్గరగా ఉండే పూజా ఆయన సినిమా నుంచి తప్పుకోవడం పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి. ఇక గుంటూర్ కారంలో మరో హీరోయిన్ గా శ్రీలీల చేస్తున్న విషయం తెలిసిందే. మరి పూజా హెగ్డే స్థానంలో ఏ హీరోయిన్ ను తీసుకుంటారో వేచి చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss