iDreamPost
android-app
ios-app

SS Rajamouli: SSMB29 లేటెస్ట్ న్యూస్! సౌతాఫ్రికాకు రాజమౌళి అండ్ కో..

  • Published Aug 09, 2024 | 2:53 PM Updated Updated Aug 09, 2024 | 2:53 PM

SSMB29.. మూవీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. రాజమౌళి అండ్ కో సౌతాఫ్రికా వెళ్తున్నారట. ఈ న్యూస్ తెలియడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

SSMB29.. మూవీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. రాజమౌళి అండ్ కో సౌతాఫ్రికా వెళ్తున్నారట. ఈ న్యూస్ తెలియడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Aug 09, 2024 | 2:53 PMUpdated Aug 09, 2024 | 2:53 PM
SS Rajamouli: SSMB29 లేటెస్ట్ న్యూస్! సౌతాఫ్రికాకు రాజమౌళి అండ్ కో..

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం SSMB29. ఇక ఈ మూవీ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ కూడా మేకర్స్ ప్రకటించలేదు. అదీకాక ఆగస్ట్ 9 మహేశ్ బాబు బర్త్ డే కానుకగా ఏదైనా స్పెషల్ వీడియోను రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ భావించారు. కానీ అది కూడా జరగలేదు. దాంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఇలాంటి టైమ్ లో ఈ చిత్రానికి సంబంధించి ఓ లేటెస్ట్ న్యూస్ వైరల్ గా మారింది. రాజమౌళి అండ్ టీమ్ సౌతాఫ్రికాకు వెళ్తోందట.

SSMB29.. మూవీ విషయంలో డైరెక్టర్ రాజమౌళి స్పీడ్ పెంచినట్లే కనిపిస్తున్నాడు. ఈ మూవీ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక అప్డేట్స్ ఇవ్వలేదు జక్కన్న. ఈ విషయంలో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నప్పటికీ.. తాజాగా తెలిసిన విషయంతో నిరాశ కాస్త తగ్గినట్లైంది. అసలు విషయం ఏంటంటే? లోకెషన్లు చూడ్డానికి రాజమౌళి అండ్ కో సౌతాఫ్రికా వెళ్తున్నారట. అక్కడే వారం రోజుల పాటు ఉండి.. లోకేషన్లను ఫైనల్ చేస్తారట. ఈ మూవీ ప్రధానంగా అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్. దాంతో ఎక్కువ భాగం అడవుల్లోనే షూటింగ్ చేయాలి. దానికోసం అద్భుతమైన లొకేషన్లను వెతికే పనిలో ఉన్నాడట జక్కన్న. ఇందుకోసమే తన టీమ్ తో కలిసి సౌతాఫ్రికా వెళ్తున్నాడు. అక్కడ ఉన్న దట్టమైన అడవుల్లో సీన్లు తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నాడు జక్కన్న.

rajamouli mahesh babu movie

కాగా.. ఈ విషయం కాస్త బయటకి రావడంతో.. మహేశ్ బాబు మూవీ విషయంలో జక్కన్న స్పీడ్ గానే ఉన్నాడు అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓ సినిమాను బొమ్మను చెక్కినట్లు చెక్కడంలో జక్కన్న సిద్ధహస్తుడు అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాకపోతే అందుకోసం కాస్త టైమ్ ఎక్కువ తీసుకుంటాడు. కాగా.. ఈ మూవీలో మహేశ్ ను ఢీ కొట్టే విలన్ ఎవరు? అన్నది ఇంకా తెలియరాలేదు. గతంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు వినిపించగా.. లేటెస్ట్ గా చియాన్ విక్రమ్ పేరు వినిపించింది. అయితే ఈ వార్తలపై విక్రమ్ కార్లిటీ ఇచ్చాడు. అక్టోబర్ లేదా నవంబర్ లో ఈ చిత్రం ప్రారంభం కావొచ్చని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss