iDreamPost
android-app
ios-app

Sameera Reddy: బిగ్ బాస్ లోకి సమీరా రెడ్డి? కానీ.. ఇక్కడే అసలు ట్విస్ట్!

  • Published Aug 09, 2024 | 1:19 PM Updated Updated Aug 09, 2024 | 1:19 PM

తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. స్టార్ హీరోయిన్ సమీరా రెడ్డి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే?

తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. స్టార్ హీరోయిన్ సమీరా రెడ్డి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే?

  • Published Aug 09, 2024 | 1:19 PMUpdated Aug 09, 2024 | 1:19 PM
Sameera Reddy: బిగ్ బాస్ లోకి సమీరా రెడ్డి? కానీ.. ఇక్కడే అసలు ట్విస్ట్!

బిగ్ బాస్.. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన బుల్లితెర షో. కేవలం తెలుగులోనే కాక హిందీ, కన్నడ, తమిళ్ లాంటి ఇతర భాషల్లో కూడా ఈ షో ప్రసారం అవుతూ.. బుల్లితెర ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది. ఇక ఈ షోలోకి అలనాటి హీరోయిన్స్ తో పాటుగా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్ననటీ, నటులను హౌస్ లోకి తీసుకొస్తుంటారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. స్టార్ హీరోయిన్ సమీరా రెడ్డి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే?

సమీరా రెడ్డి.. టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి క్రేజ్ ను దక్కించుకుంది. మెగాస్టార్ చిరంజీవి సరసన ‘జై చిరంజీవ’ మూవీతో పాటుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా నరసింహుడు, అశోక్ సినిమాల్లో నటించింది. ఈ సినిమాలు ఆశించినంత ఫలితం ఇవ్వకపోవడంతో.. ఈ అమ్మడికి అవకాశాలు రాలేదు. దాంతో టాలీవుడ్ కు దూరమైంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. బిగ్ బాస్ లోకి ఈ అమ్మడు వెళ్లబోతుందట. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అది తెలుగు బిగ్ బాస్ కాదు.. హిందీ బిగ్ బాస్. అవును హిందీ బిగ్ బాస్ సీజన్ 18 లో పాల్గొనాల్సిందిగా మేకర్స్ ఆమెను సంప్రదించినట్లు సమాచారం.

Sameera Reddy into Bigg Boss

అయితే ఆమెకు బిగ్ బాస్ నుంచి పిలుపు రావడం ఇదే మెుదటిసారి కాదు. గతంలో కూడా ఆమెకు ఆఫర్ రాగా.. దాన్ని ఆమె పలు కారణాల వల్ల తిరస్కరించింది. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆమె కచ్చితంగా బిగ్ బాస్ 18లో  పాల్గొంటుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం సమీరా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షోలో పాల్గొనడం ద్వారా తిరిగి క్రేజ్ దక్కించుకోవాలని సమీరా కూడా భావిస్తోందట. అందుకే హౌస్ లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతోందట. కాగా.. 18వ సీజన్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ స్టార్ హీరోయిన్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి, ఏ విధంగా రాణిస్తుందో?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişcasibom