రాజమౌళి బలమే శంకర్ బలహీనతగా మారిందా? ఇంట్రెస్టింగ్ స్టోరీ!

Shankar-SS Rajamouli: ఇండియన్ 2 సినిమాకు వచ్చిన రిజల్ట్ చూసి కొందరు సినీ పండితులు రాజమౌళి బలమే శంకర్ కు బలహీనతగా మారింది అంటూ ఆసక్తికర అంశాన్ని లేవనెత్తుతున్నారు. మరి జక్కన్న బలం ఏంటి? శంకర్ బలహీనత ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Shankar-SS Rajamouli: ఇండియన్ 2 సినిమాకు వచ్చిన రిజల్ట్ చూసి కొందరు సినీ పండితులు రాజమౌళి బలమే శంకర్ కు బలహీనతగా మారింది అంటూ ఆసక్తికర అంశాన్ని లేవనెత్తుతున్నారు. మరి జక్కన్న బలం ఏంటి? శంకర్ బలహీనత ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఎస్ఎస్ రాజమౌళి.. శంకర్.. ఇద్దరూ కూడా భారతీయ అగ్రదర్శకులుగా ప్రశంసలు పొందుతున్నారు. టెక్నాలజీని ఉపయోగించడంలో ఎవరికి వారే సాటి, ఇందులో ఎలాంటి సందేహం లేదు. జక్కన్న, శంకర్ లు తీసే కొన్ని షాట్స్ మన ఊహకు కూడా అందవు అంటే అతిశయోక్తికాదు. ఇప్పుడెందుకు శంకర్-రాజమౌళి గురించి ప్రస్తావన వచ్చింది? అన్న అనుమానం మీకు రావొచ్చు. శంకర్ గురించి అంటే భారతీయుడు 2 మూవీ రిలీజ్ అయ్యింది కాబట్టి వచ్చింది అనుకుందాం. మరి జక్కన్న ప్రస్తావన ఎందుకు? అక్కడికే వస్తున్నా.. ఇండియన్ 2 సినిమాకు వచ్చిన రిజల్ట్ చూసి కొందరు సినీ పండితులు రాజమౌళి బలమే శంకర్ కు బలహీనతగా మారింది అంటూ ఆసక్తికర అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

డైరెక్టర్ శంకర్.. ఈ పేరు సినిమా పోస్టర్ పై కనిపిస్తే చాలు, హీరో ఎవరు అనికూడా చూడకుండా ప్రేక్షకులు పరిగెత్తుకుంటూ థియేటర్లకు వెళ్లేవారు. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు ఈ పాన్ ఇండియా డైరెక్టర్. జెంటిల్ మెన్, భారతీయుడు, రోబో శంకర్ తీసిన అద్భుతాల్లో కొన్ని మాత్రమే. అయితే ఇప్పుడు అతడి గ్రాస్ పడిపోయిందనే చెప్పాలి. ఐ మూవీ నుంచి భారతీయుడు 2 వరకు వచ్చిన మూవీల్లో శంకర్ మార్క్ ఎక్కడో మిస్ అయ్యిందని అభిమానులు భావిస్తున్నారు. మరి శంకర్ గ్రాఫ్ ఇలా తగ్గడానికి కారణం ఉందా? అంటే బలమైన కారణమే ఉందని తెలుస్తోంది. ఆ కారణం పేరే సుజాత(స్టార్ రైటర్).

శంకర్ క్రియేటివిటీ వెనక ఉన్న అదృశ్యశక్తి పేరు సుజాత(గతంలో పేరు ఎస్ రంగరాజన్). వీరిద్దరి ప్రయాణం జెంటిల్ మెన్ నుంచి దిగ్విజయంగా కొనసాగింది. కథను అద్భుతంగా తీర్చిదిద్దడంలో, ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్లను మైండ్ బ్లోయింగ్ అయ్యేలా తీర్చిదిద్దడంలో సుజాత సిద్ధహస్తుడు. వందకు పైగా నవలలు రాసిన అనుభవం ఆయన సొంతం. ఇక ఇంజినీరింగ్ తో పాటుగా వివిధ వృత్తుల్లో పనిచేయడం అతడిని గొప్ప రైటర్ గా మార్చాయి. తన కలంతో శంకర్ వెనకాల ఉండి నడిపించిన ఆయన.. రోబో సమయంలో కన్నుమూశారు. అప్పటి నుంచి శంకర్ కు శనిపట్టుకుందనే చెప్పాలి. మళ్లీ ఈ అగ్రదర్శకుడి కాంపౌండ్ లో సుజాత లాంటి రైటర్ రాలేదు.

ఇక అపజయం అన్నదే ఎరుగని డైరెక్టర్ గా దూసుకెళ్తున్న ఎస్ఎస్ రాజమౌళి వెనకాల కూడా ఓ శక్తి ఉందన్న విషయం అందరికి తెలిసిందే. ఆ శక్తి ఎవరో కాదు.. జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్. మూల కథను విజయేంద్ర ప్రసాదే రాస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఇచ్చిన కథను జక్కన్న తన టీమ్ తో కలిసి ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తే.. ప్రేక్షకులు మెస్మరైజ్ అవుతారో అలా ఒక వెర్షన్ ను రెడీ చేస్తాడు. కానీ రాజమౌళి వెనకాల విజయేంద్ర ప్రసాద్ ఉన్నట్లు.. ఇప్పుడు శంకర్ వెనకాల సుజాత లేరు. ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు గత సినిమాల ఫలితాలే నిదర్శనం. విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి బలం అయితే.. శంకర్ బలంగా ఉన్న సుజాత రంగరాజన్ లేకపోవడం ఇప్పుడు అతడి బలహీనతగా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి

Show comments