iDreamPost
iDreamPost
ఆర్ఆర్ఆర్ ప్రభంజనం చూస్తుంటే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాకు ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో ఇప్పటి నుంచే విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రారంభం కావడానికి ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ త్రివిక్రమ్ ది కాస్త పెండింగ్ లో పెట్టి ముందు జక్కన్నది చేయమని డిమాండ్ చేస్తున్న అభిమానులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని క్లూస్ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇస్తున్నారు కానీ వాటిలో క్లారిటీ రావడం లేదు. ఆఫ్రికా అడవుల బ్యాక్ డ్రాప్ లో సరికొత్తగా ఉంటుందని, మహేష్ ని ఎన్నడూ చూడని కొత్తగా ప్రెజెంట్ చేస్తామని చెప్పారు తప్ప ఇంకే వివరాలు లేవు.
లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం జక్కన్న ప్లాన్ చేసుకున్నది ఫారెస్ట్ సెటప్ కాదట. సూపర్ స్టార్ కృష్ణకు ఐకాన్ బ్రాండ్ గా నిలిచిన జేమ్స్ బాండ్ నేపధ్యాన్ని ఎంచుకోబోతున్నట్టు తెలిసింది. ఈ జానర్ లో తెలుగులో సినిమాలు వచ్చి చాలా కాలం అయ్యింది. అడవి శేష్ గూఢచారి లాంటి ఒకటి రెండు వచ్చాయి కానీ ఈ రేంజ్ హీరో చేసినవి మాత్రం లేవు. సో ప్రిన్స్ చేస్తే అదెంత స్పెషల్ గా ఉంటుందో వేరే చెప్పాలా. ఈ జానర్ అయితే నార్త్ లోనూ మార్కెట్ ప్లస్ బిజినెస్ ఎక్కువ చేసుకోవచ్చు. ఎలాగూ రాజమౌళి పేరే వందల కోట్లు కుమ్మరిస్తుంది. అలాంటిది దానికి మహేష్ తోడైతే ఆకాశమే హద్దనే ఉపమానం ఖచ్చితంగా చిన్నదే అవుతుంది.
కాకపోతే ఇదంతా నిజమా కాదా తేలడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ముందు సర్కారు వారి పాట విడుదల కావాలి. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఉంది. ఇదంతా అయ్యేలోపు 2023 సమ్మర్ వచ్చేస్తుంది. ఆలోగా రాజమౌళి స్క్రిప్ట్ సిద్ధం చేసి ఉంటే వెంటనే సెట్స్ పైకి వెళ్తుంది. లేదూ అంటే మహేష్ ఆ గ్యాప్ లో ఇంకో మూవీ చేసుకోవచ్చు. ఆర్ఆర్ఆర్ కోసం చరణ్ తారక్ లో మూడేళ్లు త్యాగం చేయాల్సి వచ్చింది. మరి ప్రిన్స్ కి ఎంత టైం పడుతుందో కాలమే సమాధానం చెప్పాలి. అన్నట్టు ఈ జేమ్స్ బాండ్ బ్యాక్ డ్రాప్ కోసం సెట్ చేసుకున్న బడ్జెట్ 800 కోట్లని టాక్. నిజమైనా ఆశ్చర్యం లేదు లెండి. జక్కన్న బ్రాండ్ అలాంటిది
Also Read : Multiplexes : సామాన్యుడికి సినిమా దూరమా దగ్గరా