iDreamPost
android-app
ios-app

SS Rajamouli: రాజమౌళికి తప్పిన ప్రమాదం.. తృటిలో బయటపడ్డ జక్కన్న!

  • Published Mar 21, 2024 | 7:48 AM Updated Updated Mar 21, 2024 | 7:54 AM

దర్శకధీరుడు రాజమౌళి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తృటిలో దాని నుంచి బయటపడ్డారు జక్కన్న. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

దర్శకధీరుడు రాజమౌళి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తృటిలో దాని నుంచి బయటపడ్డారు జక్కన్న. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 21, 2024 | 7:48 AMUpdated Mar 21, 2024 | 7:54 AM
SS Rajamouli: రాజమౌళికి తప్పిన ప్రమాదం.. తృటిలో బయటపడ్డ జక్కన్న!

దర్శకధీరుడు రాజమౌళి ఒక్కో సినిమాతో తన ఇమేజ్​ను పెంచుకుంటూ పోతున్నారు. ‘బాహుబలి’ సిరీస్ ముందు వరకు ఆయన టాలీవుడ్​కే పరిమితమయ్యారు. కానీ ఆ మూవీలోని రెండు పార్ట్​లు బ్లాక్​బస్టర్​గా నిలవడంతో పాన్ ఇండియా డైరెక్టర్​గా గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత తీసిన ‘ఆర్ఆర్ఆర్’తో ఆయన క్రేజ్ పాన్ వరల్డ్ రేంజ్​కు ఎదిగింది. యూఎస్​, జపాన్ లాంటి విదేశాల్లో ‘ఆర్ఆర్ఆర్’ మేనియా ఇప్పటికీ తగ్గట్లేదు. ఆ దేశాల్లో వసూళ్లలో బీభత్సం సృష్టించడమే గాక ప్రేక్షకుల మనసులకూ హత్తుకుంది జక్కన్న చిత్రం. ‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళి ఎవరనే చర్చ హాలీవుడ్​తో పాటు ప్రపంచ సినిమా మొత్తం చర్చించుకుంది. అలాంటి దర్శకధీరుడు ఇప్పుడు సూపర్​స్టార్ మహేష్​బాబుతో చేస్తున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ఆయనకు ఓ ప్రమాదం తప్పింది.

జపాన్ విజిట్​లో ఉన్న రాజమౌళి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అక్కడ భూకంపం బారి నుంచి తృటిలో బయటపడ్డారు జక్కన్న. ఈ విషయాన్ని ఆయన కుమారుడు కార్తికేయ తెలిపారు. తాము ఓ బిల్డింగ్​లోని 28వ అంతస్తులో ఉన్నామని అప్పుడే మెళ్లిగా భూమి కంపించడం మొదలైందని ట్విట్టర్​లో పెట్టిన పోస్టులో కార్తికేయ చెప్పుకొచ్చారు. ‘జపాన్​లో ఇప్పుడే భూకంపం ఎలా ఉంటుందో చూశా. మేం 28వ అంతస్తులో ఉన్నాం. బిల్డింగ్ మెళ్లిగా కదలడం స్టార్ట్ అయింది. దీంతో ఇది భూకంపం వల్లేనని అర్థమైంది. మేం టెన్షన్ పడసాగాం. కానీ చుట్టూ ఉన్న జపనీయులు మాత్రం ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్నారు. ఏదో వాన పడుతున్నంత ఈజీగా వాళ్లు లైట్ తీసుకున్నారు. మొత్తానికి భూకంపాన్ని ఎక్స్​పీరియెన్స్ చేశాం’ అని కార్తికేయ ఆ పోస్టులో రాసుకొచ్చారు.