iDreamPost

SSMB29 మూవీ.. ఆ రెండు నవలల ఆధారమేనా? ఇది జక్కన్న మాస్టర్ ప్లానా?

SSMB29 మూవీకి సంబంధించి ఓ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ చిత్రాన్ని రెండు ప్రముఖ నవలల ఆధారంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం రాజమౌళి.. రెండు పుస్తకాల హక్కులను కూడా కొనుగోలు చేసినట్లు సమాాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

SSMB29 మూవీకి సంబంధించి ఓ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ చిత్రాన్ని రెండు ప్రముఖ నవలల ఆధారంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం రాజమౌళి.. రెండు పుస్తకాల హక్కులను కూడా కొనుగోలు చేసినట్లు సమాాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

SSMB29 మూవీ.. ఆ రెండు నవలల ఆధారమేనా? ఇది జక్కన్న మాస్టర్ ప్లానా?

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం రాబోతోంది. ఎప్పుడైతే ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ చేశారో.. అప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి మెుదలైంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం కావడం.. సూపర్ స్టార్ మహేష్ హీరో కావడంతో ఈ మూవీపై ఎక్కడాలేని హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ చిత్రం గురించి రోజుకో వార్త వైరల్ అవుతోంది. తాజాగా మరో న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అదేంటంటే? వరల్డ్ బెస్ట్ సెల్లింగ్ పుస్తకాల ఆధారంగా SSMB29 తెరకెక్కుతోందట. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

SSMB29.. ఇండస్ట్రీలో ఆసక్తిరేకెత్తిస్తున్న మూవీ. దిగ్గజ దర్శకుడు రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రానికి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఇప్పటికే ఈ కథ పూర్తైందని, ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటోందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా రాజమౌళి, ఆయన టీమ్ రెండు ఆఫ్రికా నవలలను హక్కులను కొనుగోలు చేశారట. ఈ పుస్తకాల ఆధారంగానే ఈ చిత్రం ఉంటుందట. ఆఫ్రికా అడవుల్లో సాగే జంగిల్ అడ్వెంచరల్ మూవీగా రానున్నట్లు సమాచారం.

రాజమౌళి అండ్ కో ‘ట్రయంప్ ఆఫ్ ది సన్’, ‘కింగ్ ఆఫ్ కింగ్స్’ అనే రెండు పుస్తకాల హక్కులను కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ రెండు నవలలను విల్బర్ స్మిత్ రాశాడు. ఈ నవలల హక్కులు రాజమౌళి కొనుగోలు చేశారన్న వార్త వైరల్ కావడంతో.. అభిమానుల్లో రకరకాల ప్రశ్నలు బలుదేరాయి. ఈ పుస్తకాల ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కుతుందా? లేక నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం జక్కన్న కథను రెడీ చేసుకుంటున్నాడా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. సాధారణంగా జక్కన్న సినిమాలకు తండ్రి విజయేంద్ర ప్రసాదే కథలు అందిస్తూ ఉంటారు. ఇప్పుడు మహేష్ తో చేసే మూవీకి సైతం ఆయనే స్టోరీని సిద్ధం చేశారు కూడా. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరి నిజంగానే మహేష్ తో చేసే మూవీ ఈ రెండు నవలల ఆధారంగానే తెరకెక్కబోతోందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి