iDreamPost
android-app
ios-app

ప్లాస్టిక్ సర్జరీలు తప్పుకావు.. నేను కూడా చేయించుకుంటా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

  • Published Jul 31, 2024 | 12:53 PM Updated Updated Jul 31, 2024 | 12:53 PM

అందంగా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేసుకోవడం తప్పేం కాదంటోంది ఓ హీరోయిన్. పైగా భవిష్యత్ లో తాను కూడా ఇలాంటి సర్జరీ చేయించుకుంటాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

అందంగా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేసుకోవడం తప్పేం కాదంటోంది ఓ హీరోయిన్. పైగా భవిష్యత్ లో తాను కూడా ఇలాంటి సర్జరీ చేయించుకుంటాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 31, 2024 | 12:53 PMUpdated Jul 31, 2024 | 12:53 PM
ప్లాస్టిక్ సర్జరీలు తప్పుకావు.. నేను కూడా చేయించుకుంటా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే నటన ఒక్కటే ఉంటే సరిపోదు. అందం, అదృష్టం కూడా ఉండాలి. ఇక పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి, అందంగా కనిపించడానికి చాలా మంది హీరోయిన్స్ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. ముక్కు, పెదాలు ఇలా తమ శరీర భాగాలకు ఆపరేషన్ చేయించుకోవడం మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. అయితే ఇలా అందంగా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేసుకోవడం తప్పేం కాదంటోంది ఓ హీరోయిన్. పైగా భవిష్యత్ లో తాను కూడా ఇలాంటి సర్జరీ చేయించుకుంటాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

రాధిక మదన్.. బాలీవుడ్ లో గుర్తింపు ఉన్న హీరోయిన్. చివరిగా సర్పిరా మూవీలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం సనా మూవీ చేస్తోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ ప్లాస్టిక్ సర్జరీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. రాధిక మదన్ మాట్లాడుతూ..”కాస్మోటిక్ సర్జరీలు చేసుకునే వారిని నేను తప్పుబట్టను. ఎందుకంటే? సర్జరీల వల్ల వారిలో అందంతో పాటుగా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అయితే నేనిక్కడ చెప్పదలచుకుంది సర్జరీలే బెస్ట్ అని కాదు. ఇక భవిష్యత్ లో నేను కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసుకునే విషయమై ఆలోచిస్తాను. ఆ సమయానికి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాను. నా దృష్టిలో ఇలాంటి సర్జరీలు తప్పేం కాదు” అని స్పష్టంగా చెప్పుకొచ్చింది రాధిక మదన్. మరి ప్లాస్టిక్ సర్జరీలు తప్పు కాదు అంటూ ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet