అప్పట్లో శ్రీకాంత్ తమ్ముడు హీరోగా వచ్చాడు! తరువాత ఏమైపోయాడంటే?

టాలీవుడ్ ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన ఫ్యామిలీలో ఇద్దరు స్టార్స్ ఉన్నారు. ఆయన సతీమణి ఊహా ఒకప్పటి హీరోయిన్ కాగా, కొడుకు రోషన్ కూడా హీరోనే. వీరే కాదు. . ఆయన తమ్ముడు కూడా నటుడే అన్న విషయం తెలుసా..?

టాలీవుడ్ ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన ఫ్యామిలీలో ఇద్దరు స్టార్స్ ఉన్నారు. ఆయన సతీమణి ఊహా ఒకప్పటి హీరోయిన్ కాగా, కొడుకు రోషన్ కూడా హీరోనే. వీరే కాదు. . ఆయన తమ్ముడు కూడా నటుడే అన్న విషయం తెలుసా..?

కుటుంబ కథా చిత్రాల నాయకుడు అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు శ్రీకాంత్. ఇప్పుడంటే నెగిటివ్, సపోర్టింగ్ పాత్రలను పోషిస్తున్నాడు కానీ ఒకప్పుడు లవర్ బాయ్. ఇండస్ట్రీలో గ్రీన్ చీట్ ఉన్న కథానాయకుడు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీలో వచ్చి..విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు.. ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. శ్రీకాంత్‌ను స్టార్ హీరోగా చేసిన చిత్రం తాజ్ మహాల్. 1995లో వచ్చిన ఈ చిత్రం శ్రీకాంత్ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. అతడికొక స్పెషల్ చిత్రంగా నిలిచిపోయింది. అయితే శ్రీకాంతే కాదు.. ఆయన తమ్ముడు కూడా నటుడే అన్న విషయం తెలుసా..? ఏంటీ శ్రీకాంత్‌కు తమ్ముడు కూడా ఉన్నాడా అనుకుంటున్నారా..? అవును ఇదిగో మీరు చూస్తున్న ఫోటోలో ఉన్నది ఈ హీరో బ్రదరే. చూసేందుకు అచ్చు శ్రీకాంత్‌లా ఉన్న ఆయన పేరు అనిల్ కుమార్.

శ్రీకాంత్ తమ్ముడు అనిల్ కుమార్ హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన మూవీ ప్రేమించేది ఎందుకమ్మా. ఇందులో అందాల సుందరి శ్రీదేవి కజిన్..గులాబి బ్యూటీ మహేశ్వరి హీరోయిన్. ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతం అందించారు. క్రాంతి కుమార్ నిర్మాతగా వ్యవహరించగా.. జాన్ మహేంద్రన్ దర్శకత్వం వహించాడు. 1999 అక్టోబర్ 8న విడుదలైన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. శ్రీకాంత్‌తో అతడి నటనను పోల్చి చూడటంతో హీరోగా అతడు రెండో ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత నిర్మాతగా కొనసాగినట్లు తెలుస్తుంది. శ్రీకాంత్, అనిల్ స్వస్థలం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మేకా వారి పాలెం. శ్రీకాంత్ ఆరేడేళ్ల వరకు ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఫ్యామిలీ కర్ణాటకకు షిప్ట్ అయ్యింది. బీకాం చేసిన శ్రీకాంత్.. హైదరాబాద్ మధు ఫిల్మ్ అండ్ టీవీ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్స్ కంప్లీట్ చేశాడు.

అప్పట్లో తెలుగు ఇండస్ట్రీ చెన్నైలో ఉండటంతో అక్కడకు షిప్ట్ అయ్యాడు. అతడి తొలి సినిమా పీపుల్స్ ఎన్ కౌంటర్. ఇందులో నక్సలైట్‌గా కనిపిస్తాడు. ఆ తర్వాత మధురా నగరిలో చిత్రంలో ఓ హీరోగా మెప్పించిన శ్రీ.. తర్వాత ఆంటోగనిస్టు, సపోర్టింగ్ రోల్స్ చేశాడు. వన్ బైటు మూవీతో మెయిన్ హీరోగా మారిన ఆయన..అక్కడ నుండి వెనుతిరిగి చూసుకోలేదు. పెళ్లి సందడి, వినోదం, తాళి, ఎగిరే పావురమా, ఆహ్వానం, మా నాన్నకు పెళ్లి, ఊయల వంటి హిట్స్ అందుకున్నాడు. 125కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. కో స్టార్ ఊహాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. కొడుకు రోషన్ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. తండ్రిలా స్మార్ట్‌గా ఉండటంతో టాలీవుడ్ హృతిక్ రోషన్ అన్న ట్యాగ్ వచ్చింది. ప్రస్తుతం వృషభ, చాంపియన్ చిత్రాలతో రాబోతున్నాడు.

Show comments