iDreamPost
android-app
ios-app

ఒట్టేసి చెపుతున్నా హీరోయిన్ ఎంతలా మారిందంటే.. యంగ్ హీరోయిన్లకు తీసిపోని విధంగా

  • Published Aug 20, 2024 | 7:15 AM Updated Updated Aug 20, 2024 | 7:15 AM

ఒట్టేసి చెపుతున్నా హీరోయిన్ ఎంతలా మారిందంటే.. యంగ్ హీరోయిన్లకు తీసిపోని విధంగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ కాక రేపుతోంది

ఒట్టేసి చెపుతున్నా హీరోయిన్ ఎంతలా మారిందంటే.. యంగ్ హీరోయిన్లకు తీసిపోని విధంగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ కాక రేపుతోంది

  • Published Aug 20, 2024 | 7:15 AMUpdated Aug 20, 2024 | 7:15 AM
ఒట్టేసి చెపుతున్నా హీరోయిన్ ఎంతలా మారిందంటే.. యంగ్ హీరోయిన్లకు తీసిపోని విధంగా

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోస్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే నటులు జగపతి బాబు, శ్రీకాంతే. ప్రస్తుతం జగపతి బాబు నెగిటివ్ రోల్స్ షిఫ్ట్ అయ్యాడు. శ్రీకాంత్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. ఇప్పుడంటే కుటుంబ కథా చిత్రాలు తక్కువగా వస్తుండటంతో ఈ హీరోలకు ఇమేజ్ తగ్గింది కానీ.. ఒకప్పుడు లవర్ బాయ్స్ ఇమేజెస్ వీరిది. ముఖ్యంగా శ్రీకాంత్‌కు విపరీతమైన లేడీ ఫాలోయింగ్ ఉండేది. ఆయన నటించిన ది బెస్ట్ చిత్రాల్లో ఒకటి ఒట్టేసి చెపుతున్నా. 2003లో వచ్చిన ఈ మూవీ మంచి హిట్ అందుకుంది. ఇందులో హీరోయిన్‌గా నటించిన యాక్ట్రెస్ గుర్తుందా.? చీమ కుట్టిన పెదాలతో, అమాయకమైన చూపులతో అప్పటి కుర్రకారును కట్టిపడేసిన ఈ చిన్నదాని పేరు దివ్య అలియాస్ కనిహ సుబ్రమణ్యం. తమిళనాడుకు చెందిన ఈ నటి ఫస్ట్ మూవీతోనే ఆకట్టుకుంది.

దివ్య చదువుల తల్లి సరస్వతి. 1999లో చదువులో తమిళనాడు ఎక్స్ లెన్స్ అవార్డును పొందింది. ఆ తర్వాత ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసింది. ఆమె మల్టీ టాలెంటర్. పాప్ సింగర్ కూడా. చిన్నప్పటి నుండే స్టేజ్ షో‌స్ ఇచ్చేది. 2001లో అందాల పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది. ఇదే చలన చిత్ర రంగానికి మార్గం సుగమం చేసింది. 2002లో మణిరత్నం నిర్మించిన ఫైవ్ స్టార్ అనే తమిళ మూవీతో ఎంట్రీ ఇచ్చిన కనిహ.. ఆ తర్వాత స్రవంతిగా పేరు మార్చుకుని ఒట్టేసి చెబుతున్నా మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అలాగే కన్నడ చిత్రం అన్నవారు మూవీలో నటిచింది. తమిళంలో ఆటోగ్రాఫ్ మూవీలో నటించింది. తెలుగులో కూడా నా ఆటోగ్రాఫ్ చిత్రంలో రవితేజకు భార్యగా నటించింది.

ఆ తర్వాత ఈమె తెలుగు సినిమాలలో కనిపించలేదు. కానీ ఈమె తమిళ్,మలయాళంలో కలిపి ఇరవై ఐదు సినిమాలకు పైగా నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2008లో శ్యామ్ రాధా కృష్ణన్ అనే అమెరికా సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఓ సంవత్సరం గ్యాప్ తీసుకుని భగవద్గీత అనే మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. అంతలో బాబు పుట్టాడు. అయినప్పటికీ సినిమాలు కంటిన్యూ చేస్తూనే ఉంది. హీరోయిన్‌గానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ చేసింది. ఇప్పుడు హీరో, హీరోయిన్లకు మదర్ క్యారెక్టర్లలో నటిస్తుంది. అలాగే నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూ మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం 41 ఏళ్ళు వయస్సు ఉన్న ఈమె యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కాక రేపుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Kaniha (@kaniha_official)

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş