iDreamPost
android-app
ios-app

ఓ చిన్నదానా మూవీ హీరోయిన్ ఎలా ఉందో తెలుసా..? ఇప్పుడు ఆ సీరియల్లో..

  • Published Aug 20, 2024 | 7:40 PM Updated Updated Aug 20, 2024 | 7:40 PM

శ్రీకాంత్, రాజా హీరోలుగా వచ్చిన చిత్రం ఓ చిన్నదానా. 2002లో విడుదలైన రొమాంటిక్ కామెడీ చిత్రం మంచి హిట్ అందుకుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఒకరు గజాలా కాాగా, మరొకరు..

శ్రీకాంత్, రాజా హీరోలుగా వచ్చిన చిత్రం ఓ చిన్నదానా. 2002లో విడుదలైన రొమాంటిక్ కామెడీ చిత్రం మంచి హిట్ అందుకుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఒకరు గజాలా కాాగా, మరొకరు..

  • Published Aug 20, 2024 | 7:40 PMUpdated Aug 20, 2024 | 7:40 PM
ఓ చిన్నదానా మూవీ హీరోయిన్ ఎలా ఉందో తెలుసా..? ఇప్పుడు ఆ సీరియల్లో..

1990వ దశకంలో వరుస హిట్లతో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో శ్రీకాంత్. ఇటు లవ్ స్టోరీలతో పాటు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే రొమాంటిక్ కామెడీ చిత్రాల్లోనూ ఆకట్టుకున్నాడు. ఈ కేటగిరి చిత్రాల్లో ఒకటి ఓ చిన్నదానా. 2002లో వచ్చిన ఈ మూవీ మంచి హిట్ అందుకుంది. ప్రముఖ దర్శకుడు ఈ సత్తిబాబు దర్శకత్వం వహించాడు. హాలీవుడ్ మూవీ 10 థింగ్స్ ఐ హేట్ ఎబౌట్ యూ మూలాల్ని తీసుకుని తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లు ఛేంజ్ చేశాడు డైరెక్టర్. ఇక ఇందులో శ్రీకాంత్, రాజా హీరోలుగా నటించగా.. గజాలా, శృతి రాజ్, ఆశా షైనీ ఫీమేల్ లీడ్స్. రాజాకు గజాలా నటించగా.. శ్రీకాంత్ సరసన శృతి రాజ్ యాక్ట్ చేసింది. తన చిన్ననాటి స్నేహితుడు రాజేష్ కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయే అమర ప్రియురాలిగా నటించింది.

ఇప్పుడు ఆ శృతి రాజ్ ఎలా ఉందో తెలుసా..? సినిమాలకు దూరమైనా.. టెలివిజన్ సీరియల్స్‌లో నటిస్తూ ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. మలయాళంలో కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. విజయ్ హీరోగా నటించిన మూవీతోనే ఆమెకు గుర్తింపు దక్కింది. కొన్ని తమిళ్ సినిమాలు చేశాక.. సోనీగా పేరు మార్చుకుని శివరాజ్ కుమార్ సరసన అండమాన్ మూవీలో యాక్ట్ చేసింది. అటు మలయాళం, ఇటు కన్నడ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. అలా 2001లో తెలుగులో తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. వేణు హీరోగా వచ్చిన వీడెక్కడి మొగుడంటీ సినిమాలో శృతి పాత్రలో మెరిసింది. ఆ తర్వాత శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఓ చిన్నదానాలో యాక్ట్ చేసింది. తెలుగులో ఇక నటించలేదు కానీ ఓ సీరియల్ చేసింది.

o chinadana movie pic talk

తమిళంలో ఓ నాలుగు సినిమాలు చేసి.. సినీ ఇండస్ట్రీ నుండి తప్పుకుంది. కానీ ఓ ఏడాది గ్యాప్ ఇచ్చి బుల్లితెరపై కనువిందు చేసింది. తేండ్రాల్ అనే తమిళ సీరియల్‌తో పాటు తెలుగులో కూడా శ్రావణి- సుబ్రమణ్యం అనే సీరియల్ చేసింది. ఇది జెమినీ టీవీలో ప్రసారం అయ్యింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు తమిళ బుల్లితెరపైనే కొనసాగుతుంది. వరుస పెట్టి ధారావాహికలే చేస్తోంది. అపూర్వ రాగంగల్, తలాట్టు నుండి లక్ష్మీ సీరియల్ వరకు సన్ టీవీతోనే కలిసి వర్క్ చేస్తోంది. అలాగే పలు షోల్లో కూడా పాల్గొంటోంది. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గానే వ్యవహరిస్తోంది. యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది ఈ నటీమణి. రీల్స్, షాట్స్ చేస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తుంది. అయితే ఈ స్టార్ నటి ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by 𝐒𝐑𝐔𝐓𝐇𝐈 𝐑𝐀𝐉 (@iamsruthiraj)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss