iDreamPost
android-app
ios-app

Srikanth:హీరో శ్రీకాంత్ కూతురిని చూశారా.. హీరోయిన్స్ ని మించిన అందంతో

  • Published Jan 05, 2024 | 11:59 AM Updated Updated Jan 05, 2024 | 11:59 AM

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలిబ్రిటీలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. వారి అభిమాన హీరో హీరోయిన్ల సినిమాలను ఎంతగా ఆదరిస్తారో.. వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎపుడైనా సామజిక మాధ్యమాలలో కనిపిస్తే.. వాటిని కూడా అలానే వైరల్ చేస్తూ ఉంటారు.

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలిబ్రిటీలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. వారి అభిమాన హీరో హీరోయిన్ల సినిమాలను ఎంతగా ఆదరిస్తారో.. వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎపుడైనా సామజిక మాధ్యమాలలో కనిపిస్తే.. వాటిని కూడా అలానే వైరల్ చేస్తూ ఉంటారు.

  • Published Jan 05, 2024 | 11:59 AMUpdated Jan 05, 2024 | 11:59 AM
Srikanth:హీరో శ్రీకాంత్ కూతురిని చూశారా..  హీరోయిన్స్ ని మించిన అందంతో

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తిరుగులేని హీరో శ్రీకాంత్. ఎన్నో హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించి.. ఇండస్ట్రీలో ఎందరో అభిమానులను తన సొంతం చేసుకున్నాడు. కొంతకాలం కెరీర్ లో డౌన్ ఫాల్ చూసినా కూడా ఇప్పటికి మంచి క్యారెక్టర్స్ చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు శ్రీకాంత్. ఈ హీరోకు ఫ్యామిలి ఆడియన్సు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. శ్రీకాంత్ వారసత్వంగా ఆయన తనయుడు రోషన్ కూడా వెండి తెరపై హీరోగా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు శ్రీకాంత్ కూతురు మేధా కూడా.. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందా అనే టాక్ నడుస్తోంది. ఆమె తాజాగా తన కుటుంబంతో దిగిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా, 90వ శతకంలో విడుదలైన ఆమె చిత్రంలో హీరోయిన్ ఊహా, శ్రీకాంత్ జంటగా నటించారు. అప్పట్లో ఈ సినిమా మంచి టాక్ ను సంపాదించుకుంది. కొన్నాళ్ళు రహస్యంగా ప్రేమించుకున్న వీరిద్దరూ 1997లో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే, వీరి వివాహం తర్వాత ఊహా సినిమాలకు గుడ్ బై చెప్పారు. వీరికి రోషన్, రోహన్, మేధా అనే ముగురు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. అమ్మ నాన్నల పోలికలతోనే ముగ్గురు పిల్లలు చక్కగా ఉంటారు. అయితే, వీరు సామజిక మాధ్యమాలలో అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఇక  ఎప్పుడైనా వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో టక్కున మెరిస్తే.. అందరి దృష్టి వారి మీదనే ఉంటుంది. ఇక ఇప్పుడు తాజాగా శ్రీకాంత్ కూతురు మేధా చీరకట్టుతో.. అచ్చ తెలుగమ్మాయిలా ఉన్న ఫోటోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి.

గురువారం రోజున శ్రీకాంత్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చాలా కాలం తర్వాత  శ్రీకాంత్ సతీమణి, పిల్లలు బయట కనిపించడంతో.. వారి చిత్రాలను, వీడియోలను టక్కున వారి కెమెరాలలో బంధించి నెట్టింట పోస్ట్ చేశారు అభిమానులు. వీరిలో ముఖ్యంగా శ్రీకాంత్ కూతురు మేధా.. అందరి దృష్టిని ఆకర్షించింది. సంప్రదాయబద్ధంగా చీరకట్టుతో.. నిండు తెలుగుదనం ఉట్టిపడేలా మేధా మెరిసిపోయింది. చాలా సాదా సీదాగా అందంగా కనిపించి అందరిని ఆకట్టుకుంది మేధా. దీనితో వీరి ఫొటోస్ సామజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి.

పైగా.. ఆమె ఫొటోస్ ను చూసిన నెటిజన్లు.. ఒక స్టార్ హీరోయిన్ కు ఏ మాత్రం తగ్గకుండా మేధా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మేధా కూడా త్వరలో సినిమాలలో ఎంట్రీ ఇవ్వనుందా అంటూ.. గుసగుసలాడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో కొంతమంది స్టార్ సెలెబ్రిటీల కుమార్తెలు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరి, ఇదే క్రమంలో శ్రీకాంత్ కుమార్తె కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తే.. తన తండ్రి పేరును నిలబెట్టడం ఖాయం. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మరి, ఈ ఫొటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio