iDreamPost
android-app
ios-app

ఓం భీమ్‌ బుష్‌లో సంపంగి దెయ్యం ఇతనే!

  • Published Mar 24, 2024 | 6:41 PM Updated Updated Apr 20, 2024 | 12:51 PM

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సినిమా 'ఓం భీమ్ బుష్'. ఇక కామెడీ హార్రర్ జోన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రేక్షకులందరికి బాగా ఆకట్టుకున్న పాత్ర సంపంగి దెయ్యం. అయితే ఈ పాత్రలో అంత అద్భుతంగా అలరించిన వ్యక్తి ఎవరో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సినిమా 'ఓం భీమ్ బుష్'. ఇక కామెడీ హార్రర్ జోన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రేక్షకులందరికి బాగా ఆకట్టుకున్న పాత్ర సంపంగి దెయ్యం. అయితే ఈ పాత్రలో అంత అద్భుతంగా అలరించిన వ్యక్తి ఎవరో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Mar 24, 2024 | 6:41 PMUpdated Apr 20, 2024 | 12:51 PM
ఓం భీమ్‌ బుష్‌లో సంపంగి దెయ్యం ఇతనే!

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సినిమా ‘ఓం భీమ్ బుష్’. హార్రర్, కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ సినిమాను హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ఇక ఇందులో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ ఫిమేల్ లీడ్స్ లో నటించగా.. ప్రియా వడ్లమాని ఓ స్పెషల్ సాంగ్ లో నటించారు. అలాగే ఇందులో కామాక్షి భాస్కర్ గెస్ట్ పాత్రలో మెరిపించింది. కాగా, ఓం భీమ్ బుష్ సినిమాను మార్చి 22న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పైగా ఈ సినిమా రిలీజైన దగ్గర నుంచి మంచి హిట్ టాక్ నడుస్తుంది. ఎందుకంటే.. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ తో పాటు హారర్ ఎలిమెంట్స్ తో భయపెట్టి, చివర్లో ఓ ఎమోషనల్ పాయింట్ ని కూడా చూపించిన ఈ సినిమా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదలైన నుంచి ఇప్పటి వరకు మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో దెయ్యం క్యారెక్టర్ అనేది అడియాన్స్ కు బాగా నచ్చిందనే చెప్పాలి. ఇక అందులో  దెయ్యం క్యారెక్టర్ ఎవరు చేశారో అనేది ప్రస్తుతం రివీల్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కామెడీ హార్రర్ జోన్‌లో తెరకెక్కిన ‘ఓం భీమ్ బుష్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.10.44 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అలాగే ఎక్కడ చూసినా ఈ సినిమాకు మంచి టాప్ రివ్యూలు వస్తున్నాయి. అలానే పబ్లిక్ లో కూడా ఈ సినిమా పై మంచి టాక్ నడుస్తుంది. అసలే హార్రర్ జోనర్ లో తెరకెక్కిన సినిమాలంటే అడియాన్స్ లో మంచి ఆసక్తి ఉంటుంది. దానికి తోడు ఆ సినిమాకు కామెడీ యాడ్ అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఓం భీమ్ బుష్ సినిమాలో ఓ పాత్ర ప్రేక్షకులందరికి బాగా ఆకట్టుకుంది. అదే సంపంగి దెయ్యం. అయితే ఈ క్యారెక్టర్‌లో నటించింది ఎవరో ఇప్పటివరకూ మూవీ టీమ్ కూడా రివీల్ చేయలేదు. కానీ, తాజాగా ఈ సినిమాలో నవ్వించి మరి కాసేపు భయపెట్టి, చివరిలో ఎమోషన్ తో ఏడిపించిన ఆ పాత్ర ఏవరో రివీల్ అయ్యింది .

ఇన్నీ వేరియేషన్స్ లో పాత్రలో ఒదిగి మెప్పించిన క్యారెక్టర్ లో వ్యక్తి డ్యాన్సర్ ‘మనీష్ కుమార్’ అని తెలిసింది. కాగా, మనీష్ ఓ డ్యాన్స్ కంపెనీలో ఒక క్లాసికల్ డ్యాన్సర్. అందుకే ఈ సినిమాలో సంపంగి దెయ్యం పాత్రలో అంత అద్భుతంగా డ్యాన్స్ చేయగలిగారు. ఇక ఈ ట్రాన్స్‌జెండర్ పాత్రలో మనీష్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇప్పటికే గూగుల్‌లో సంపంగి దెయ్యం పాత్ర చేసింది ఎవరా అని తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే, ఇంతలోనే ఈ పాత్రలో ఉన్న వ్యక్తి కోసం రివీల్ కావడంతో ఇతని బ్యాక్ గ్రాండ్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి, ఓం భీమ్ బుష్ సినిమాలో సంపగి దెయ్యం పాత్రలో నటించిన డ్యాన్సర్ మనీష్ కుమార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss