iDreamPost
android-app
ios-app

శ్రీముఖిని కిస్ చేయబోయిన ముక్కు అవినాశ్.. చెంప చెళ్లుమనిపించిన యాంకర్!

  • Author singhj Published - 03:23 PM, Thu - 20 July 23
  • Author singhj Published - 03:23 PM, Thu - 20 July 23
శ్రీముఖిని కిస్ చేయబోయిన ముక్కు అవినాశ్.. చెంప చెళ్లుమనిపించిన యాంకర్!

తెలుగులో స్టార్ యాంకర్​గా చక్రం తిప్పుతున్న వారిలో శ్రీముఖి ఒకరు. ఈ అందాల భామ ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీకి, జోష్​కు ఏమాత్రం ఢోకా ఉండదు. హుషారెక్కించే మాటలతో పాటు అదిరిపోయే గ్లామర్ ఆమె సొంతం. అందుకే శ్రీముఖి వరుసగా షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు టీవీ షోలు హోస్ట్ చేస్తూనే మరోవైపు అవకాశం దొరికినప్పుడు మూవీ ఈవెంట్స్​కు కూడా యాంకరింగ్ చేస్తున్నారామె. స్టార్​ మాలో ప్రసారమయ్యే ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోకు ఆమెనే హోస్ట్​గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో వైరల్ అవుతోంది. ఇందులో శ్రీముఖికి ముక్కు అవినాశ్ కిస్ చేయబోయారు.

‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోలో ప్రతివారం సీరియల్ సెలబ్రిటీలను పిలిచి వాళ్లతో గేమ్స్ ఆడించి, నవ్వించి బాగా ఎంటర్​టైన్ చేస్తుంటారు శ్రీముఖి. ఈవారం కూడా అలాగే ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అంటూ పాత సీరియల్స్​లోని హిట్ పెయిర్స్​ను తీసుకున్నారు. వారితో రకరకాల ఆటలు ఆడించారు. ఈ క్రమంలో నిఖిల్-కావ్య (గోరింటాకు) జోడీకి ఒక టాస్క్ ఇచ్చారు శ్రీముఖి. వాళ్లకు ఒక డైలాగ్ ఇచ్చి ఇలా నటించాలంటూ చెబుతూ చూపించారు. పార్థూ ఒక్కసారి నాకు ముద్దు పెట్టు అంటూ ముక్కు అవినాశ్​తో కలసి నటించి వాళ్లకు చూపించారు శ్రీముఖి. అయితే ముద్దు పెట్టమంటూ చొక్కా పట్టుకొని అడిగేసరికి క్యారెక్టర్​లో లీనమైపోయిన అవినాశ్ ఆమెకు కిస్ ఇచ్చేద్దామని చూశారు.

అవినాశ్​ తనకు ముద్దు పెట్టేందుకు రావడాన్ని గమనించిన శ్రీముఖి.. ఆయన చెంప చెళ్లుమనిపించారు. దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా తెగ నవ్వుకున్నారు. ఫన్ కోసం సరదాగా చేసిన సీన్ అయినా అవినాశ్ చెంప పగిలినప్పుడు మాత్రం సౌండ్ దద్దరిల్లింది. ఇకపోతే, రేటింగ్ పరంగా ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షో దూసుకుపోతోంది. రాములమ్మ చలాకీ యాంకరింగ్​కు తోడు ముక్కు అవినాశ్, ఎక్స్​ప్రెస్ హరి కామెడీకి ఫైమా హడావుడి తోడవ్వడంతో మంచి ఎంటర్​టైన్​మెంట్​ను అందిస్తోందీ షో. మరి.. ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోను మీరూ చూస్తుంటారా? ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş