iDreamPost
android-app
ios-app

ప్రభాస్ సరసన శ్రీలీల! కాదనలేక నిజం చెప్పేసిన డైరెక్టర్!

  • Author ajaykrishna Published - 01:52 PM, Thu - 28 September 23
  • Author ajaykrishna Published - 01:52 PM, Thu - 28 September 23
ప్రభాస్ సరసన శ్రీలీల! కాదనలేక నిజం చెప్పేసిన డైరెక్టర్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో తెలిసిందే. ఇటీవల సలార్ ని కంప్లీట్ చేసిన డార్లింగ్.. ఓవైపు నాగ్ అశ్విన్ తో కల్కి.. మరోవైపు మారుతీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలే కాకుండా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్.. సీతారామం ఫేమ్ హను రాఘవపూడితో ఓ సినిమా లైనప్ చేసేసాడు. ఇవేగాక మంచు విష్ణు కన్నప్ప సినిమాలోను ప్రభాస్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి డార్లింగ్.. క్షణం తీరిక లేకుండా షూటింగ్స్, సినిమాలతో గడిపేస్తున్నాడు. మధ్యలో ఫారెన్ టూర్స్.. సర్జరీల గోల ఉండనే ఉంది. ప్రస్తుతం ప్రభాస్ మోకాలికి సర్జరీ చేయించుకొని.. రెస్ట్ లో ఉన్నాడు.

త్రలోనే తిరిగి షూటింగ్స్ లో పాల్గొంటాడు. అయితే.. ప్రభాస్ ఇమేజ్, క్రేజ్ కి.. ఏ హీరోయిన్ అయినా డార్లింగ్ తో సినిమా చేయాలని కోరుకుంటుంది. అనుకున్నట్లుగా కొందరు లక్కీ హీరోయిన్స్ అవకాశాలు అందుకున్నారు. ఆల్రెడీ ఆదిపురుష్ లో కృతిసనన్.. సలార్ శృతిహాసన్ నటించారు. ఇప్పుడు కల్కిలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, దిశా పటాని చేస్తున్నారు. మరోవైపు మారుతీ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం షూటింగ్స్ జరుపుకుంటున్న సినిమాలే కాకుండా.. త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోయే సినిమాలకు సంబంధించి రెండు రోజులుగా కొన్ని రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి.

ఆ వివరాల్లోకి వెళ్తే.. డార్లింగ్ సరసన ట్రెండింగ్ బ్యూటీ శ్రీలీల నటించనుందని.. హను రాఘవపూడి ఆమెను ఓకే చేశారని రూమర్స్ తెగ చక్కర్లు కొట్టేశాయి. కానీ.. ఇవన్నీ వార్తలు అవాస్తవం అని కొట్టి పారేసాడు డైరెక్టర్ హను. ఇటీవల ఓ వెబ్ సిరీస్ ఈవెంట్ లో పాల్గొన్న హను.. ప్రెస్ తో మాట్లాడుతూ.. ప్రభాస్ సినిమా మొదలవ్వడానికి ఇంకా చాలా టైమ్ ఉందని చెప్పాడు. వచ్చే ఏడాది సెకండాఫ్ లో తమ సినిమా, స్పిరిట్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తుందని.. అప్పుడే కాస్టింగ్ గురించి ఆలోచిస్తామని చెప్పేశారు. శ్రీలీల గురించి వస్తున్న వార్తలలో నిజం లేదని క్లారిటీ ఇచ్చేశారు. సో.. మొత్తానికి ప్రభాస్ తో శ్రీలీల కాదని ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చేసింది. మరి సీతారామం లాంటి కల్ట్ క్లాసిక్ తీసిన హను.. ప్రభాస్ తో ఎలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి!

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/