iDreamPost
android-app
ios-app

డేంజర్ జోన్‌లో శ్రీలీల.. ఆ హీరోయిన్ల పరిస్థితే రానుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు కెరీర్ తారా జువ్వాల వెలిగి.. ఒక్కసారిగా డౌన్ అయినవాళ్లు ఉన్నారు. స్టార్ రేంజ్ కి ఎదిగిన హీరోయిన్లు తీసుకునే నిర్ణయాల వల్ల కెరీర్ డేంజర్ లో పడుతుందని ఫిలిమ్ వర్గాల టాక్.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు కెరీర్ తారా జువ్వాల వెలిగి.. ఒక్కసారిగా డౌన్ అయినవాళ్లు ఉన్నారు. స్టార్ రేంజ్ కి ఎదిగిన హీరోయిన్లు తీసుకునే నిర్ణయాల వల్ల కెరీర్ డేంజర్ లో పడుతుందని ఫిలిమ్ వర్గాల టాక్.

డేంజర్ జోన్‌లో శ్రీలీల.. ఆ హీరోయిన్ల పరిస్థితే రానుందా?

సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎవరి కెరీర్ ఎలా సాగుతుందో ఎవరూ ఊహించలేరు. ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ సరైన గుర్తింపు రానివారు ఉంటారు.. ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ రేంజ్ కి ఎదిగిన వారు ఉంటారు. సాధారణంగా కొంతమంది హీరోయిన్ల విషయంలో అదృష్టం భలే కలిసి వస్తుంది. టాలీవుడ్ లో చాలా వరకు మాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ల హవా సాగుతున్న సమయంలో అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా శ్రీలీల ‘పెళ్లి సంద‌ D’మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందం, అభినయం తో పాటు అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్ తో కుర్రకారుకి భలే నచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకు పోయింది. తాజాగా శ్రీలీలకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లి సంద‌ D’సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది శ్రీలీల.  ఈ చిత్రం లో శ్రీలీల తన అందంతో పాటు, డ్యాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ఆ తర్వాత కాస్త గ్యాప్ వచ్చినా.. రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీలో తన గ్లామర్, మాస్ డ్యాన్స్ తో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది. ఇంకేముంది ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. వరుస ఆఫర్లు ఆమె తలపు తట్టాయి. బడా బ్యానర్లు అన్నీ శ్రీలీలకు ముందుగానే అడ్వాన్సులు ఇచ్చే రేంజ్ కి ఎదిగింది. దీంతో ఈ అమ్మడు తన పాత్ర ప్రాధాన్యత చూడకుండా.. హీరో, బ్యానర్ పేర్లు చూసి వరుసగా సంతకాలు చేసింది. ఇప్పుడు అదే తన కెరీర్ ని డేంజర్ జోన్లో పడేసిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. దీనికి కారణం శ్రీలీల నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా పడటం.

రవితేజ ధమాకా మూవీలో మంచి పేరు వచ్చినా.. తర్వాత నటించిన ‘స్కంద’,‘ఆదికేశవ’,‘ఎక్‌‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ మూవీస్ వరుసగా డిజాస్టర్ అయ్యాయి. వాస్తవానికి ఈ మూవీస్ పై శ్రీలీల ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. ఇక బాలయ్య నటించిన ‘భగవంత్ కేసరి’ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటించలేదు.. ఒక ముఖ్యపాత్రలోనే కనిపించింది. దీంతో ఆ హిట్ బాలయ్య ఖాతాలో చేరిపోయింది. ఈ ఏడాది మహేష్ బాబు హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ మూవీతో 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాకపోతే ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోవాలంటే.. కెరీర్ బిగినింగ్ లో వరుస సక్సెస్ అందుకోవాలి.. లేదంటే డేంజర్ జోన్ లో పడే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతుంటారు. ఇప్పుడు శ్రీలీల వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతుంది. గతంలో పూజా హెగ్డే, కృతి శెట్టి లాంటి హీరోయిన్లు ఇలాంటి తప్పులే చేసి తెలుగు తెరకు కనుమరుగైపోయారని, ఇప్పుడు శ్రీలీల కూడా అదే లీస్ట్ లో చేరుతుందన్న అనుమానాలు వస్తున్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.  మరీ టాలీవుడ్ లో శ్రీలీల కెరీర్ సాగుతుందో ముందు ముందు చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి