P Venkatesh
కీడాకోలా మూవీలో లెజెండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వాయిస్ ను రీక్రియేట్ చేసి వాడుకున్నందుకు ఎస్పీ చరణ్ చిత్ర యూనిట్ కు లీగల్ నోటీసులు పంపించారు.
కీడాకోలా మూవీలో లెజెండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వాయిస్ ను రీక్రియేట్ చేసి వాడుకున్నందుకు ఎస్పీ చరణ్ చిత్ర యూనిట్ కు లీగల్ నోటీసులు పంపించారు.
P Venkatesh
అందుబాటులో ఉన్న టెక్నాలజీతో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ముఖ్యంగా ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ తో ఏఐ యాంకర్లను కూడా సృష్టించారు. ఇటీవల ప్రముఖ హీరో సోగ్గాడు శోభన్ బాబు ఏఐ వీడియో నెట్టింటా హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సింగర్స్ వాయిస్ ను కూడా ఏఐతో రీ క్రియేట్ చేస్తున్నారు. అంతే కాదు మరణించిన లెజెండరీ గాయకుల వాయిస్ ను ఏఐ సాయంతో తిరిగి సృష్టిస్తున్నారు. తాజాగా ఈ ఏఐతో వాయిస్ రీక్రియేట్ అంశం వివాదాస్పదంగా మారింది. లెజండరీ సింగర్, గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వాయిస్ రీక్రియేట్ చేసి కీడాకోలా మూవీలో వాడుకున్నారు. దీనిపై ఎస్పీ చరణ్ కీడాకోలా మూవీ యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో దర్శకుడుగా తానేంటో నిరూపించుకున్నారు తరుణ్ భాస్కర్. గతేడాది కీడాకోలా మూవీతో వచ్చిన తరుణ్ భాస్కర్ ఆడియెన్స్ ను అలరించారు. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుని మంచి కలెక్షన్లను వసూల్ చేసింది. అయితే ఈ సినిమాలో ఓ సీన్ లో వచ్చే స్వాతిలో ముత్యమంత అనే సాంగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఆ వాయిస్ పాత పాటలోనిదే అని అందరు భావించారు. కానీ ఏఐ సాయంతో ఎస్పీ బాలు వాయిస్ ను రీక్రియేట్ చేసి వాడుకున్నట్లు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ విషయం ఎస్పీ చరణ్ చెవిన పడింది.
ఈ వ్యవహారంపై మండిపడిన చరణ్ కీడాకోలా చిత్ర యూనిట్ కు లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపారు. ఏఐ టెక్నాలజీతో ఆయన స్వరానికి మళ్లీ ప్రాణం పోయడం హర్షించదగిన పరిణామమే. కానీ ఎలాంటి అనుమతి లేకుండా, సమాచారం అందివ్వకుండా ఆయన వాయిస్ ను రీక్రియేట్ చేయడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. ఇక ముందేవరూ కూడా ఇలా బాధ్యత మరిచి చేయకుండా ఉండాలంటే కీడాకోలా చిత్ర యూనిట్ క్షమాపణలు చెప్పి, నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఏఐ సాయంతో ఎస్పీ బాలు వాయిస్ ను పర్మిషన్ లేకుండా ఉపయోగించుకున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.