టాలీవుడ్ నటి సౌమ్య జానుకి హైకోర్టులో ఊరట

Sowmya Janu Gets Relief: తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య మరీ ఎక్కువ అయ్యాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఇటీవల సామన్యులకే కాదు.. సెలబ్రెటీలపై కూడా కేసులు నమోదు అవుతున్నాయి.

Sowmya Janu Gets Relief: తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య మరీ ఎక్కువ అయ్యాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఇటీవల సామన్యులకే కాదు.. సెలబ్రెటీలపై కూడా కేసులు నమోదు అవుతున్నాయి.

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. చలాన్లు విధిస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదని అధికారులు అంటున్నారు. నిర్లక్ష్యం, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అనుభవ రాహిత్యం, రాంగ్ రూట్ లో ప్రయాణించడం ఇలా ఎన్నో కారణాల వల్ల నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండుకుంటుంది. ఇటీవల రాంగ్ రూట్ వచ్చిన కేసులో టాలీవుడ్ నటికి హైకోర్టులో ఊరట లభించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సౌమ్య జాను కి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆమెపై నమోదు అయిన కేసులో పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సౌమ్యజాను హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేసింది. గత వారం బంజారాహిల్స్ లో రాంగ్ రూట్ లో కారు నడుపుతూ రావడమే కాదు.. దాన్ని ప్రశ్నించినందుకు హూంగార్డుని దుర్భషలాడుతూ చేయి చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఆమెపై హోంగార్డు బంజారా హిల్స్ పీఎస్ ఫిర్యాదు చేయగా.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  పలు సెక్షన్ల ఆధారంగా సౌమ్య జానుకు ఏడేళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

నటి సౌమ్య జాను పిటిషన్ పై మంగళవారం విచారించిన ధర్మాసన.. చట్ట ప్రకారం 41ఏ కింద నోటీసులు ఇచ్చిన తర్వాత ఆమెను అదుపులోకి తీసుకోవాలని, అప్పటి వరకు ఆమెపై చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అంతేకాదు.. దర్యాప్తు అధికారికి విచారణలో పూర్తి సహకారం అందించాలని సౌమ్య జానుకు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఆమె బంజారాహిల్స్ పోలీసుల ఎదుట విచారణలకు హాజరయ్యింది. తనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంపై సౌమ్య జాను మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆ రోజు నేను అలా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో పోలీసులకు చెప్పాను.. నేను ఎవరిపై దాడికి యత్నించలేదు.. అసభ్యంగా మాట్లాడలేదు. జాగ్వార్ కారు కూడా నాది కాదు.. నా స్నేహితురాలిది. ఈ విషయాలు తెలియకుండా మీడియాలో నాపై తప్పుడు ప్రచారాలు మొదలయ్యాయి. నేను ఆ రోజు రాంగ్ రూట్ లో వెళ్లింది వాస్తవమే.. తప్పు చేశానని అప్పుడే ఒప్పుకున్నా.. మళ్లీ మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తా’ అని చెప్పింది.

Show comments