చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా ఉంది.. ‘ఆదిపురుష్’ సినిమాపై వస్తున్న ట్రోల్స్ వ్యవహారం. డైరెక్టర్ ఓం రౌత్ రూపొందించిన ఈ సినిమా.. ఈ ఏడాది జూన్ లో విడుదలై మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే.. ఇతిహాసాల జోలికి వెళ్ళినప్పుడు కథాకథనాలతో పాటు విజువల్స్ కూడా కళ్లు చెదిరేలా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారు. ఎందుకంటే.. రామాయణం, మహాభారతం లాంటివి ఎవరైనా లైఫ్ లో ఒక్కసారే తీయగలరు. అలా డైరెక్టర్ ఓం రౌత్.. రామాయణం ఆధారంగా ఆదిపురుష్ తీశాడు. సినిమా కథాంశం గొప్పదే అయినప్పటికీ.. విజువల్స్, డైలాగ్స్, మోడరన్ లైఫ్ స్టైల్ ఇవన్నీ బెడిసి కొట్టడంతో.. విమర్శల పాలైంది సినిమా.
ఇక సినిమా అనౌన్స్ మెంట్ అయినప్పుడు ఎంత హ్యాపీ అయ్యారో.. తీరా రిలీజ్ టైమ్ కి, రిలీజ్ అయ్యాక.. థియేటర్స్ నుండి వెళ్ళిపోయాక కూడా సినిమాని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. మొత్తానికి ఇటీవల ఆదిపురుష్ అన్ని విమర్శలు, వివాదాలు ఫేస్ చేసి.. ఓటిటి రిలీజ్ అయ్యింది. సరే ఆదిపురుష్ సంగతి అయిపోయింది కదా అనుకుంటున్న టైమ్ లో కొత్తగా మరో చర్చను లేవనెత్తారు నెటిజన్స్. అదేంటంటే.. తాజాగా భారత్ చంద్రుని పైకి పంపిన ‘చంద్రయాన్ 3’ ప్రయోగం సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచం అంతా చంద్రయాన్ 3 గురించి.. గొప్పగా మాట్లాడుకుంటోంది. కట్ చేస్తే.. మరోవైపు చంద్రయాన్ 3తో ఆదిపురుష్ ని పోల్చుతూ ట్రోలింగ్ జరుగుతోంది.
అదేంటి.. చంద్రయాన్ 3కి, ఆదిపురుష్ కి సంబంధం ఏంటని మీకు సందేహం రావచ్చు. దానికి కారణాలు ఇలా వినిపిస్తున్నాయి. అవేంటంటే.. చంద్రయాన్ సక్సెస్ అయ్యాక ఓ సైంటిస్ట్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగానికి మొత్తం రూ. 615 కోట్ల వరకు ఖర్చు అయ్యిందని.. అదెలా సాధ్యం అయ్యిందో చెబితే ఇతర దేశాలు కాపీ కొడతాయని.. అందుకే బడ్జెట్ వివరాలు రహస్యంగా ఉంచుతున్నట్లు చెప్పుకొచ్చారట. ఇప్పుడదే బడ్జెట్ పాయింట్ తో ఆదిపురుష్ ని ఆటాడుకుంటున్నారు ట్రోలర్స్, నెటిజన్స్. సినిమా బడ్జెట్ దాదాపు రూ. 600 కోట్లకు పైగా అయ్యిందని నిర్మాతలు తెలిపారు. సో.. అలాంటి విజువల్స్ సరిగ్గా లేని ఔట్ ఫుట్ కి ఖర్చు పెట్టడం కంటే.. చంద్రయాన్ లాంటి ప్రయోగాలకు కేటాయిస్తే.. కనీసం దేశ ప్రగతికి ఉపయోగం ఉంటుందని ట్రోల్ చేస్తున్నారు. ఇదేంటీ మోకాలికి బోడి గుండుకు ముడి వేస్తున్నారంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఆదిపురుష్ పై చంద్రయాన్ ఎఫెక్ట్ ఉందనటంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
There is a wrong comparison going between #Prabhas‘ #Adipurush budget & #Chandraayan3 budget.
Both are completely different. Hollywood movies are produced double/triple the budget of #VikramLander and failed at box office.
Individual producer produces a movie of his choice for… pic.twitter.com/wUKl1XeCu0
— Manobala Vijayabalan (@ManobalaV) August 23, 2023