iDreamPost
android-app
ios-app

భారీ ధరకు ‘లియో’ రైట్స్! బరిలోకి దిగిన తెలుగు ప్రొడ్యూసర్!

  • Author ajaykrishna Published - 09:10 AM, Thu - 20 July 23
  • Author ajaykrishna Published - 09:10 AM, Thu - 20 July 23
భారీ ధరకు ‘లియో’ రైట్స్! బరిలోకి దిగిన తెలుగు ప్రొడ్యూసర్!

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సినిమాలలో దళపతి విజయ్ నటిస్తున్న ‘లియో’ ఒకటి. ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్న సినిమా ఇది. ఖైదీ, విక్రమ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన లోకేష్.. లియో మూవీతో విజయ్ ని సైతం అదే యూనివర్స్ లో ప్రెజెంట్ చేయనున్నాడు. విజయ్ సరసన చాలా గ్యాప్ తర్వాత హీరోయిన్ త్రిష నటిస్తోంది. దసరా ఫెస్టివల్ సందర్బంగా అక్టోబర్ 19న లియో వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. కాగా.. తెలుగులో విజయ్ క్రేజ్ గురించి తెలిసిందే. ఇప్పుడు లియో విషయానికి వస్తే.. విజయ్ తో పాటు లోకేష్ పేరు ఇంతటి క్రేజ్ కి కారణమైంది.

ఇక లియోకి సంబంధించి థియేట్రికల్ రిలీజ్ రైట్స్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. ముఖ్యంగా తెలుగులో ఓ స్ట్రెయిట్ ఫిల్మ్ కి జరిగిన రేంజ్ లో లియో బిజినెస్ జరగడం విశేషం. అయితే.. లియో తెలుగు రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు సొంతం చేసుకున్నారు. దాదాపు రూ. 21 కోట్లకు లియో రైట్స్ ని ప్రొడ్యూసర్ నాగవంశీ కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేగాక లియో మూవీతో.. సితార ఎంటర్టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అడుగుపెడుతోంది. ఇన్నాళ్లు ప్రొడక్షన్ మాత్రమే చేపట్టిన సితార బ్యానర్ వారు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ లో కూడా ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

లియో బిజినెస్ విషయానికి వస్తే.. ఈ మధ్యకాలంలో ఓ తమిళ డబ్బింగ్ సినిమాకి తెలుగులో రూ. 21 కోట్లు పెట్టి హక్కులు కొనుగోలు చేయడం మొదటిసారి అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అయితే.. సినిమాపై, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పై ఆ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఇప్పటిదాకా విడుదలైన మూవీ స్టఫ్ అంచనాలు మాత్రం పీక్స్ కి చేర్చాయి. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్ లతో పాటు డైరెక్టర్స్ గౌతమ్ మీనన్, మిస్కిన్, అనురాగ్ కష్యప్ కీలక పాత్రలు పోషిస్తుండటం ఇంటరెస్టింగ్ పాయింట్. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న లియో.. విజయ్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబడుతుందని అంటున్నారు. మరి లియో మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş