iDreamPost
android-app
ios-app

పెళ్లి పీటలు ఎక్కబోతున్న సింగర్‌ హారికా నారాయణ్‌.. వరుడేవరంటే

  • Published Mar 07, 2024 | 10:40 AM Updated Updated Mar 07, 2024 | 10:40 AM

Singer Harika Narayan: ఎంతో అందంగా, ఆద్భుతమైన గాత్రంతో అలరిస్తున్న టాలీవుడ్ సింగర్ హారిక నారాయణ్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ శుభవార్తను తెలియజేసింది.

Singer Harika Narayan: ఎంతో అందంగా, ఆద్భుతమైన గాత్రంతో అలరిస్తున్న టాలీవుడ్ సింగర్ హారిక నారాయణ్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ శుభవార్తను తెలియజేసింది.

  • Published Mar 07, 2024 | 10:40 AMUpdated Mar 07, 2024 | 10:40 AM
పెళ్లి పీటలు ఎక్కబోతున్న సింగర్‌ హారికా నారాయణ్‌.. వరుడేవరంటే

టాలీవుడ్ సింగర్ ‘హారిక నారాయణ్’.. ఈ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేకపోవచ్చు. కానీ, ఈమె స్టార్ హీరో రవితేజ గతేడాది నటించిన ‘రావణసుర’ సినిమాలో ‘అంథెమ్’ సాంగ్ తో చాలా మందికి చేరువైంది. ఇక హారిక చదివింది మెకానికల్‌ అయినా మ్యూజిక్‌ మీద ప్యాషన్‌తో ఈ ఫీల్డ్ ని ఎంచుకోగా.. ఇప్పుడు తన గాత్రంతో అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పాడిన ఈ బ్యూటిపుల్ సింగర్ తనదైన ట్యాలెంట్‌తో అందరిని మెస్మరైజ్‌ చేస్తోంది.ఇప్పటికే వరుస స్టేజ్ షోలు, పలు సినిమాల్లో పాటలు పాడుతూ కెరీర్ లో దూసుకెళ్తున్న హారిక పలు పాటలతో లక్షలమందిని అలరించింది. అయితే తాజాగా ఈ అమ్మాడు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్న అని తన సోషల్ మీడియా ఖాతాలో తెలియజేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తన గాత్రన్ని అందించిన హారిక అనుకుంటే హీరోయిన్ గా కూడా రాణించవచ్చు. ఎందుకంటే.. హీరోయిన్లను మించిన అందం ఆమె సొంతం కావడం విశేషం. అయితే ఎంతో అందంగా.. తన బ్యూటిపుల్ వాయిస్ తో అందరిని మంత్రముగ్ధులను చేసే ఈ బ్యూటీ త్వరలోనే తన స్నేహితుడు పృధ్వినాథ్ తో కలిసి ఏడు అడుగులు వేయనున్నట్లు తన ఇన్ స్టాగ్రామ్ వేదిక ద్వారా తెలిపింది. కాగా, వారిద్దరి మధ్య స్నేహంగా ఏర్పడిన పరిచయం కాస్త ఆపై ప్రేమగా మారిందని తెలిపింది. అలా మనసిచ్చుకున్న ఇరువువురు మధ్య ఏడు సంవత్సరాల పాటు సుదీర్ఘమైన ప్రయాణం సాగిందని చెప్పింది. ఇక వారిద్దరూ ఉంగారాలు మార్చుకున్న ఫోటోను కూడా హారిక షేర్ చేసింది. కానీ, తనకు కాబోయే భర్త గురించి మాత్రం ఆమె ఎలాంటి వివరాలు షేర్ చేయాలేదు.ఇదిలా ఉంటే.. పాపులర్ సింగర్ గా మారిన హారిక తెలగమ్మాయి కావడం గమన్హారం. ఈమె పుట్టింది తూర్పు గోదావరి జిల్లా రాజోలులో కాగా, తండ్రి ఎయిర్ ఫోర్స్ లో బాధ్యతలు నిర్వహిస్తుండడంతో ఆమె ఉత్తరాదిలో పెరిగారు. ఇక మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి జర్మనీ వెళ్లాలని ఆమె ఎన్నో కలలు కన్నది. కానీ, అనుకోని విధంగా ఇలా గాయనిగా మారి నేడు తన గాత్రంతో అందర్నీ ఆకట్టుకుంటుంది.

ఇక ఈమె ప్రముఖ సంగీత విధ్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కుటుంబానికి దగ్గరి బంధువు కావడం విశేషం. కాగా, ఈమె కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్న తర్వాత.. మొదట మెగా హీరోయిన్ నిహారిక కథానాయికగా నటించిన సూర్యకాంతంలో ప్లేబ్యాక్ సింగర్ గా మారింది. ఆ తర్వాత నా తప్పు ఏమున్నదబ్బా (బ్లాక్ రోజ్ ) సాంగ్ తో యూత్ కు కనెక్ట్ అయ్యింది. ఇలా విభిన్నమైన వాయిస్ తో ఎంతోమంది సినీ ప్రముఖల్నీ, సంగీత ప్రియుల్నీ మెప్పించిన హారిక.. కేవలం 90 సెకన్లలో తొమ్మిది మంది ఇంటర్నేషనల్ సింగర్స్ ని ఇమిటెడ్ చేస్తూ ఆమె చేసిన ఆల్బమ్ ప్రపంచవ్యాప్తంగా అందర్నీ బాగా ఆకర్షించింది. ఇక హారికకు హీరో మహేశ్ బాబు అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానమని.. ఆయనను దగ్గర నుంచి చూడవచ్చనే బ్రహ్మోత్సవం సినిమాలో నటించనని గతంలో ఆమె తెలిపింది. ఇక తన అభిమాన హీరో సినిమా అయిన సర్కారువారి పాటలో హారిక టైటిల్ ట్రాక్ పాడి దుమ్మురేపిన విషన తెలిసిందే. మరి, త్వరలో ఈ బ్యూటిపుల్ సింగర్ పెళ్లిపీటలు ఎక్కాబోతుండడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Harika Narayan (@harika_narayan)

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetjojobetMeritbet güncel girişJojobet GirişbetraHoliganbetgalabetHoliganbetJojobetHoliganbetJojobetHoliganbetJojobet GirişJojobet Giriş