iDreamPost
android-app
ios-app

టిల్లు స్క్వేర్ అప్డేట్ లో సూపర్ ట్విస్ట్.. కథ మొత్తం చెప్పారు గమనించారా?

  • Published Feb 07, 2024 | 9:50 PM Updated Updated Feb 07, 2024 | 9:50 PM

Siddhu Tillu Square Story Line: సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా టిల్లు స్క్వేర్ నుంచి ఒక అప్ డేట్ తీసుకొచ్చారు. అయితే ఆ వీడియోలో సినిమా లైన్ చెప్పేశారుగా..

Siddhu Tillu Square Story Line: సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా టిల్లు స్క్వేర్ నుంచి ఒక అప్ డేట్ తీసుకొచ్చారు. అయితే ఆ వీడియోలో సినిమా లైన్ చెప్పేశారుగా..

  • Published Feb 07, 2024 | 9:50 PMUpdated Feb 07, 2024 | 9:50 PM
టిల్లు స్క్వేర్ అప్డేట్ లో సూపర్ ట్విస్ట్.. కథ మొత్తం చెప్పారు గమనించారా?

స్టార్ బాయ్ సిద్ధు నటించిన టిల్లు సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్ తో మరోసారి అదరగొట్టేందుకు సిద్ధు జొన్నలగడ్డ రెడీ అయిపోయాడు. టిల్లు స్క్వేర్ మూవీ మీద ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ అన్నీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సిద్ధు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఒక అప్ డేట్ అయితే వచ్చింది. అదేంటంటే.. ఫిబ్రవరి 14న ఈ మూవీ ట్రైలర్ రాబోతోంది అని చెప్పారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఈ చిన్న వీడియోలోనే టిల్లు స్క్వేర్ కథ ఎలా ఉండబోతోందో చెప్పేశారు గమనించారా?

డీజే టిల్లుకి టాలీవుడ్ ఆడియన్స్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అతని డైలాగ్స్, లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ కిరాక్ ఉంటాయి. ఇప్పటికీ మార్కెట్ లో టిల్లు డ్రెస్ అంటూ అమ్మేస్తున్నారు. అంతలా టిల్లు సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ తో మరోసారి ఆడియన్స్ కి గిలిగింతలు పెట్టేయడానికి సిద్ధు రెడీ అయిపోయాడు. ఫస్ట్ పార్ట్ అంత సక్సెస్ అయ్యాక.. సీక్వెల్ కచ్చితంగా నెక్ట్స్ లెవల్లో ఉండాలి. దానికి తగినట్లుగానే గట్టిగానే ప్లాన్ చేసినట్లు అర్థమైపోతోంది. హీరోయిన్ అనుపమను ఎంచుకున్నప్పుడో సగం సక్సెస్ సాధించేశారు అనాలి. పైగా ఈ మూవీలో అనుపమ మొదటిసారి బోల్డ్ క్యారెక్టర్ చేస్తోంది.

సిద్ధు బర్త్ డే సందర్భంగా ట్రైలర్ అప్ డేట్ ని రిలీజ్ చేశారు. దానికోసం ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో టిల్లు స్క్వేర్ కథకు సంబంధించి ఒక చిన్న హింట్ ఇచ్చారు. డీజే టిల్లు సినిమా మొత్తం తన బర్త్ డే రోజు రాత్రి ఏం జరిగింది అనే దాని చుట్టూనే తిరుగుతుంది. దాదాపుగా ఒక్క రాత్రి జరిగిన కథగా డీజే టిల్లుని చూపించారు. ఇప్పుడు టిల్లు స్క్వేర్ వీడియోలో అనుపమ లాస్ట్ ఇయర్ బర్త్ డేకి ఏం చేశావు అంటే.. కట్ షాట్స్ లో టిల్లు సినిమాని చూపించారు. టిల్లు ఈ బర్త్ డేకి కూడా ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు అర్థమైపోతోంది. అప్పుడు రాధిక, ఇప్పుడు అనుపమను పరిచయం చేసుకున్నాడు. ఈమెను కూడా రాధికతో పోలుస్తూ ఇప్పటికే రాధికా రాధికా పాటను రిలీజ్ చేశారు. డీజే టిల్లులో రాధిక మీద మనసు పారేసుకున్న టిల్లు.. ఈ మూవీలో అనుపమ మీద మనసు పారేసుకున్నాడు.

టిల్లు స్క్వేర్ మూవీ బోటమ్ లైన్ మాత్రం సేమ్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఇంక కథలో కొన్ని ట్విస్టులు, స్టోరీలో కొత్తదనం చూపిస్తారు అనడంలో సందేహం లేదు. ఈసారి టిల్లు కథను దేశాలు దాటిస్తున్న విషయం తెలిసిందే. టిల్లు స్క్వేర్ సినిమా అబ్రాడ్ లో కూడా జరిగింది. అంటే కథ పరంగా ఈసారి ఇంకా పకడ్బందీగా ప్రాన్ చేశారు. కాకపోతే ప్రేక్షకులకు ఈ మూవీకి సంబంధించి ఒక చిన్న హింట్ అయితే ఇచ్చారు. పంచులు, ఎంటల్ టైన్మెంట్ లో ఏమాత్రం తగ్గదని ఓ క్లారిటీ అయితే ఇచ్చారు. రొమాన్స్ కూడా ఈసారి గట్టిగానే ఉండబోతోంది. టిల్లు స్క్వేర్ మూవీ మార్చి 29న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కాబోతోంది. మరి.. టిల్లు స్క్వేర్ కథ విషయంలో టీమ్ ఇచ్చిన హింట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş