iDreamPost
android-app
ios-app

ఇన్నేళ్లకు నాని – శృతిహాసన్ కాంబినేషన్ లో సినిమా!

  • Author ajaykrishna Updated - 09:22 AM, Wed - 2 August 23
  • Author ajaykrishna Updated - 09:22 AM, Wed - 2 August 23
ఇన్నేళ్లకు నాని – శృతిహాసన్ కాంబినేషన్ లో సినిమా!

చిత్రపరిశ్రమలో కొంతమంది హీరోహీరోయిన్స్ కాంబినేషన్ చాలా ఆలస్యంగా సెట్ అవుతుంటాయి. కెరీర్ ఆరంభం అయినప్పటి నుండి దాదాపు వేరే హీరోలతో బిజీ అయినా.. ఏదొక సినిమాలో వీరి కాంబినేషన్ పడితే బాగుండు అనిపిస్తుంది. అలాంటి క్రేజీ కాంబినేషన్స్ లో కొత్తగా ఒకటి సెట్ అయ్యిందని తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. దసరా మూవీతో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. దీంతో నాని నుండి వస్తున్న తదుపరి సినిమాలపై సినీ ప్రేక్షకుల దృష్టి పడింది. ప్రస్తుతం నాని హీరోగా డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ తో ‘హాయ్ నాన్న’ అనే మూవీ చేస్తున్నాడు. తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో నాని సరసన సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇందులో నాని తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన టీజర్ మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. మొదటిసారి నాని సరసన శృతిహాసన్ నటిస్తోంది. అసలు ఇన్నేళ్లుగా వీరి కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. దీంతో కాంబో సెట్ అయ్యేసరికి ఫ్యాన్స్ కి కూడా కొత్తగా అనిపిస్తుంది. అయితే.. హాయ్ నాన్న సినిమాలో శృతి కూడా ఓకే అయ్యింది. అది ఎలాంటి రోల్ అన్నది చాలా సీక్రెట్ గా ఉంచేశారు మేకర్స్. కానీ.. సోషల్ మీడియాలో కొన్ని కథనాలు ట్రెండ్ అవుతున్నాయి.

ఆ వివరాల్లోకి వెళ్తే.. హాయ్ నాన్న టీజర్ గమనిస్తే.. అందులో నానికి ఆల్రెడీ ఓ పాప ఉంటుంది. పెళ్ళై పాప ఉన్న నానికి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. అంటే.. టీజర్ లో కనిపించని తల్లి పాత్ర, నాని భార్యగా శృతి నటిస్తుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ బలంగా వినిపిస్తుంది. అదిగాక శృతి పాత్ర కొద్దిసేపే అయినప్పటికీ.. చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని టాక్. ఇదిలా ఉండగా.. జెర్సీ తర్వాత నాని ఈ సినిమాలో తండ్రి క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు. ఇందులో కూడా ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. ఇక ఈ సినిమాకి హేషం అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు. మరి నాని, శృతి కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetcup girişgrandpashabet