iDreamPost
android-app
ios-app

రజినీ కోసం ఒకరు తప్పుకోవడమా.. లేక ఇద్దరు ఉండటమా..?

  • Author ajaykrishna Updated - 03:36 PM, Fri - 15 September 23
  • Author ajaykrishna Updated - 03:36 PM, Fri - 15 September 23
రజినీ కోసం ఒకరు తప్పుకోవడమా.. లేక ఇద్దరు ఉండటమా..?

జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్.. ‘జై భీమ్’ ఫేమ్ టిజే జ్ఞానవెల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ మెంట్ జరిగిన ఈ సినిమాలో.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా.. ఇంకా షూటింగ్ మొదలుకాని ఈ సినిమాపై ప్రేక్షకులలో అనౌన్స్ మెంట్ తోనే అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు సినిమా మొదలవుతుందా.. కొత్త అప్డేట్స్ ఏమేం వస్తాయా అని చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే.. ఈ సినిమాలో రజినీ, అమితాబ్ లతో పాటు కీలకమైన పాత్రల కోసం ఇండస్ట్రీలో చాలా పేర్లు వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమా రజినీ కెరీర్ లో 170వది. సో.. ఈ సినిమా రజినీ కెరీర్ తో పాటు డైరెక్టర్ జ్ఞానవెల్ కెరీర్ లో కూడా చాలా స్పెషల్ కాబోతుంది. అయితే.. ఈ సినిమాలో రజినీ, అమితాబ్ క్యారెక్టర్స్ పరస్పరం సపోర్టింగ్ గా ఉంటాయని.. వీరికి వ్యతిరేకంగా ఓ యంగ్ క్యారెక్టర్ ఉంటుందని టాక్ నడిచింది. కట్ చేస్తే.. ఆ క్యారెక్టర్ కోసం తెలుగులో నానిని అడగ్గా.. నో అన్నాడట. ఆ తర్వాత హీరో శర్వానంద్ ని అడిగితే ఓకే చెప్పాడని ఆ మధ్య వార్తలు గట్టిగా వినిపించాయి. కానీ.. దానిపై మేకర్స్ గానీ, శర్వాగానీ అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. సో.. ఇంకా ఆ రోల్ కి శర్వా కన్ఫర్మ్ కాలేదని అర్ధమవుతుంది.

ఒకవేళ కన్ఫర్మ్ అయినప్పటికీ.. రజినీ సినిమాలో తెలుగు హీరోకు ఛాన్స్ దొరకడం అంటే మామూలు విషయం కాదు. కానీ.. ఇప్పుడు ఇందులో కూడా మార్పులు జరుగుతున్నట్లు సమాచారం. తలైవార్ 170లో శర్వానంద్ క్యారెక్టర్ కోసం.. హీరో రానా బరిలోకి దిగుతున్నట్లు టాక్. దీంతో పాటు మరో ఇంటరెస్టింగ్ విషయం కూడా వినిపిస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాలో శర్వానంద్ తో పాటు రానా.. ఇద్దరు కూడా నటిస్తారని కథనాలు చెబుతున్నాయి. మరి ప్రస్తుతానికి రజినీ సినిమాలో శర్వా ఓకే అయ్యాడా.. శర్వా స్థానంలో రానా ఓకే అయ్యాడా? లేక వీరిద్దరూ ఓకేనా? అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş