iDreamPost
android-app
ios-app

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఫస్ట్ డే కలెక్షన్స్! విశ్వక్ ఎంత రాబట్టాడంటే?

  • Published Jun 01, 2024 | 11:42 AM Updated Updated Jun 01, 2024 | 12:23 PM

Gangs Of Godavari Movie First Day Collections: విశ్వక్ సేన్ లేటెస్ట్ గా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి తొలిరోజు విశ్వక్ సేన్ రాబట్టిన వసూళ్లు ఎంతో ఇప్పుడు చూద్దాం.

Gangs Of Godavari Movie First Day Collections: విశ్వక్ సేన్ లేటెస్ట్ గా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి తొలిరోజు విశ్వక్ సేన్ రాబట్టిన వసూళ్లు ఎంతో ఇప్పుడు చూద్దాం.

  • Published Jun 01, 2024 | 11:42 AMUpdated Jun 01, 2024 | 12:23 PM
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఫస్ట్ డే కలెక్షన్స్! విశ్వక్ ఎంత రాబట్టాడంటే?

విశ్వక్ సేన్.. ‘గామి’ ప్రయోగాత్మక చిత్రం తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే ఫుల్ లెంత్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఎన్నో వాయిదాల అనంతరం థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇక బుక్ మై షో, గూగుల్ కూడా తమ సినిమాకు తక్కువ రేటింగ్స్ ఇచ్చాయని మూవీ టీమ్ వాపోయింది. ఇదే విషయాన్ని నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో విశ్వక్ సైతం వెల్లడించాడు. కొంత మంది కావాలనే తమ సినిమాకు తక్కువ రేటింగ్ వచ్చేలా ఓట్ చేస్తున్నారని చెప్పాడు. ఈ క్రమంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తొలి రోజు ఎంత రాబట్టిందో ఇప్పుడు చూద్దాం.

డైరెక్టర్ కృష్ణ చైతన్య రూట్ మార్చి తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల తేదీల్లో వివాదాలు నెలకొని ఎట్టకేలకు రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ ను సాధించిందనే చెప్పాలి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం విశ్వక్ డీసెంట్ ఓపెనింగ్స్ నే రాబట్టాడు. నైజాంలో రూ. కోటి పది లక్షలు, వైజాగ్ రూ. 46 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 28 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 24 లక్షలు, గుంటూరు రూ. 30 లక్షలు, నెల్లూరు రూ. 17 లక్షలు, సీడెడ్ రూ. 76 లక్షలు వసూల్ చేేసింది. టోటల్ గా రూ. 3. 32 కోట్ల గ్రాస్ సాధించింది. కోటిన్నర షేర్ సంపాదించింది. ఓవర్సీస్ కలెక్షన్లు కలిస్తే.. తొలిరోజు దాదాపు రూ. 4 కోట్ల వసూళ్లు సాధించాడు విశ్వక్.

ఇక ఈ సినిమా ప్రీ బిజినెస్ లెక్కవ వివరాల్లోకి వస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని రూ. 12 కోట్ల మేర బిజినెస్ చేసింది. దాంతో 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన విశ్వక్ కు వీకెండ్ కసిసొస్తుంది కాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించడం ఈజీ అవుతుంది. అయితే వీకెండ్ తర్వాత ఎన్నికల రిజల్ట్ ఉండటంతో.. జనాలు సినిమాలు చూసే మూడు లో ఉంటారు అనుకోవడం పొరపాటే అవుతుంది. దాంతో కలెక్షన్లు డ్రాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ డే కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasibombetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet